Panthangi toll plaza Fact check: హైదరాబాద్-విజయవాడ రహదారిపై యాదాద్రి భవనగిరి జిల్లా పంతంగివద్ద ఉన్న టోల్‌ప్లాజా ఎత్తేశారంటూ సోషల్ మీడియలో ఓ న్యూస్ వైరలైంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ టోల్‌ప్లాజా తొలగించారని చెప్పగానే చాలా మంది వాహనదారులు సంతోషపడ్డారు. ఇక నుంచి టోల్ వాత తప్పిందని ఎగిరిగంతేసి తెలిసిన వారికి న్యూస్ షేర్ చేశారు. అయితే తీరా అది ఫేక్ న్యూస్ అని తెలియడంతో ఉసూరుమన్నారు.
అసలీవార్త ఇంత వైరల్ కావడానికి కారణం ఈ మధ్యే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో చేసిన ప్రకటన. జాతీయరహదారులపై రెండు టోల్ ప్లాజాల మధ్య ఖచ్చితంగా 60 కిలోమీటర్ల దూరం ఉండాలని... మధ్యలో ఏర్పాటుచేసిన టోల్‌ప్లాజాలను మూడు నెలల్లో పూర్తిగా తొలగిస్తామని గడ్కరీ తెలిపారు. మధ్యలో ఇలా టోల్ ప్లాజాలను ఏర్పాటుచేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. గడ్కరీ ప్రకటన నేపథ్యంలో తెలంగాణలో పలు టోల్ ప్లాజాలు తొలగిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. పంతంగి టోల్ ప్లాజాతో పాటు రాయ్కల్, కొత్తగూడెం, మన్ననూరు, గుమ్మడిదల, గూడూరు, కడ్తాల్ టోల్‌ప్లాజాలను తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం హఠాత్తుగా పంతంగి టోల్‌ప్లాజా రేకులు తొలగించే ఓ ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది. టోల్‌ప్లాజా ఎత్తేస్తున్నట్లు న్యూస్ వైరల్ అయ్యింది.
పంతంగి టోల్‌ప్లాజా ఎత్తేశారన్న వార్త నిజానిజాలపై జీ తెలుగు న్యూస్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ టోల్‌ప్లాజా సిబ్బందితో మాట్లాడింది. రెండు మూడు రోజుల కింద మరమ్మత్తుల సందర్భంగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారని.. పంతంగి టోల్‌ప్లాజా మూసేస్తున్నారన్న ప్రచారం చేశారని అక్కడి సిబ్బంది స్పష్టంచేశారు. ఇదంతా అసత్య ప్రచారమని.. ప్లాజా మూసేయాలన్న ఆదేశాలు అసలు తమకు రాలేదన్నారు. గడ్కరీ ప్రకటనపై అసలు నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఇంకా చర్యలే మొదలు పెట్టలేదన్నారు. ఒకవేళ టోల్‌ప్లాజా ఎత్తేయాలన్న నిర్ణయం తీసుకున్న అది ఇంత త్వరగా అమలుకాదని.. దానికి కాస్త సమయం పడుతుందన్నారు. గడ్కరీ ప్రకటనను తప్పుగా అన్వయం చేసుకుంటున్నారని... టోల్ ప్లాజాలు దగ్గరదగ్గరగా ఉంటే.. నిబంధనల మేరకు 60 కిలోమీటర్ల దూరం పాటిస్తూ వాటిని అదే రోడ్డుపై వేరే ప్రదేశంలో ఏర్పాటుచేస్తారని తెలిపారు.
Also Read: Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన డీజిల్..
Also Read: SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్, భారీ జరిమానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook