Young Man riding a bicycle without using his hands in curve road: సాధారణంగా ప్రతిఒక్కరు రెండు చేతులా హ్యాండిల్ పట్టుకుని సైకిల్ తొక్కుతుంటారు. కొందరు ఒక చేత్తో కూడా తొక్కుతారు. ఇంకొందరు రెండు చేతులు వదిలి కాస్త దూరం వరకు వేగంగా తొక్కుతారు. అయితే ఓ యువకుడు మాత్రం ఏకంగా నెత్తిపై బరువైన మూట పెట్టుకుని చాలా మలుపులు ఉన్న రోడ్డుపై వేగంగా దూసుకెళుతున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భారత దేశంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఓ యువకుడు నెత్తిన బట్టల మూట పెట్టుకుని రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నాడు. తలపై బరువైన మూట ఉన్నా.. హ్యాండిల్స్ వదిలేసి ఎంతో సూనాయాసంగా సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేస్తుంటాడు. రోడ్డు మలుపులుగా ఉన్నా కూడా అతడు హ్యాండిల్స్ మాత్రం ముట్టుకోలేదు. ఆ యువకుడు మెయిన్ రోడ్డు వదిలి గ్రామం వైపు తిరగడంతో వీడియో హఠాత్తుగా ముగుస్తుంది. యువకుని వెనక వెళుతున్న ఓ వాహనదారుడు ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు.
This man is a human Segway, with a built in gyroscope in his body! Incredible sense of balance. What pains me, however, is that there are so many like him in our country who could be talented gymnasts/sportspersons but simply don’t get spotted or trained… pic.twitter.com/8p1mrQ6ubG
— anand mahindra (@anandmahindra) March 29, 2022
వీడియో చూసిన వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా బరువెక్కిన హృదయంలో ఓ ట్వీట్ చేశారు. 'ఈ యువకుడు ఓ హ్యుమన్ సెగ్వేలా ఉన్నాడు. జైరోస్కోప్ అతడి వంటిలోనే ఉన్నట్టుగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. అతడి బ్యాలెన్స్ ప్రతిభ నమ్మశక్యం కానిది. ఈ వీడియో చూస్తుంటే నాకు బాధేస్తోంది. భారత్‌లో టాలెంట్ ఉన్న వారు ఎండారో ఉన్నారు. వీరంతా మంచి జిమ్నాస్టులు, స్పోర్ట్స్ పర్సన్స్‌గా మారాల్సిన వాళ్లు. కానీ శిక్షణ లేక వెలుగులోకి రాలేకపోతున్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Fedex CEO: మరో దిగ్గజ సంస్థకు భారతీయుడి నాయకత్వం- ఫెడ్ఎక్స్ సీఈఓగా రాజ్ సుబ్రమణియం
Also Read: Rashmika Gym Workout: జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న రష్మిక.. ఏందీ ఆ వర్కౌట్లు! వీడియో చూస్తే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook