Bus falls into gorge near Tirupati: చిత్తూరు: తిరుపతి సమీపంలోని చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు భాకరాపేట వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న సుమారు 100 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. బస్సు లోయలో పడిన ఘటనలో బస్సు డ్రైవర్, ఒక చిన్నారి సహా 10 మందికి పైగానే చనిపోయారని తెలుస్తోంది. లోయలో పూర్తిగా చీకటి అలుముకుని ఉండటంతో చీకట్లో ఏమీ కనిపించే పరిస్థితి లేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది వరకు పెళ్లి బృందం ఉన్నట్టు సమాచారం.
సహాయం కోసం క్షతగాత్రులు పెడుతున్న ఆర్తనాదాలతో ఘటనా స్థలం విషాదకరంగా మారింది. పెళ్లి బృందంలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం అందుతోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. చీకటి వేళ జరిగిన ప్రమాదం కావడంతో ప్రయాణికుల క్షేమ సమాచారం ఏంటనేది ఇంకా పూర్తిగా తెలియరావడం లేదు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే కానీ మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. మరోవైపు బంధువుల రోదనలతో రుయా ఆస్పత్రి పరిసరాల్లోనూ భీకరమైన వాతావరణం నెలకొంది.
రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, స్టేట్ డిజాస్టర్ ఫోర్స్, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ, జిల్లా అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు.
అయితే లోయలో పూర్తిగా చీకటి అలుముకుని ఉండటంతో పాటు దట్టంగా చెట్లు ఉండటంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు తెలిపారు. అదే రహదారి గుండా వెళ్తున్న వాహనదారులు సైతం తమ వంతు సహాయం చేస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ఘటనకు (Road accident) సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also read : AP New Districts: ఏపీ కొత్త జిల్లాలపై 4-5 రోజుల్లో తుది నోటిఫికేషన్ విడుదల
Also raed : AP 3 Capitals: తెర పైకి మూడు రాజధానులు.. వెనక్కి తగ్గేదేలే అన్న జగన్.. మండిపడ్డ ప్రతిపక్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook