Disney plus hotstar: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ ఇండియా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు సునీల్ రాయన్. వ్యక్తిగత కారణాలతోనే తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిసింది. 2020 జూన్‌లో డిస్నీ+ హాట్ స్టార్ ఇండియా అధ్యక్షుడిగా నియమితులయ్యారు సునీల్ రాయన్. అంతకు ముందు గూగుల్ క్లౌడ్ ఫర్ గేమ్స్ విభాగానికి ఎండీగా సేవలందించారాయన.
డిన్నీ+ హాట్‌స్టార్ బాధ్యతల నుంచి రాయన్ తప్పుకున్న విషయాన్ని వాల్డ్ డిస్నీ ఇండియా అండ్ స్టార్ ఇండియా అధ్యక్షుడు కె. మాధవన్.. సంస్థ ఉద్యోగులకు పంపిన మేయిల్లో తెలిపారు.
ఈ మేరకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు మాధవన్. దాదాపు రెండేళ్లపాటు రాయన్ అందించిన సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వంలో కంపెనీ మంచి విజయాలను అందుకోగలిగిందన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వివరించారు.
Also read: Airtel Big Offer: ఉచితంగా ప్రైమ్, సోని లివ్ OTTసభ్యత్వం.. అదికూడా ఎయిర్టెల్ తో..
Also read: Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకం ద్వారా పొదుపు చేస్తే డబ్బు రెట్టింపు ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Disney plus hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ అధ్యక్ష పదవిని వీడిన సునీల్ రాయన్!
డిస్నీ+ హాట్‌స్టార్ అధ్యక్షుడు రాజీనామా
వ్యక్తిగత కారణాలే కారణం
అధికారికంగా ప్రకటించిన డిస్నీ ఇండియా అధ్యక్షుడు