Smartphone Hacks: ఈరోజుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తూనే ఉన్నారు. చిన్న, పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలా మంది స్మార్ట్ ఫోన్ ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అయితే ఈ మొబైల్స్ యూజ్ చేసేవారికి స్కీన్ పగుళ్ల సమస్య కొత్తేమి కాదు. కానీ, మీ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే పగుళ్లు ఏర్పడినట్లైతే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. పగుళ్లు ఏర్పడిన డిస్ ప్లేను మార్చుకునేందుకు సెల్ ఫోన్ రిపేర్ షాప్ కు వెళ్లకుండా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
టూత్ పేస్ట్ తో..
మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై మీకు పగుళ్లు ఉంటే.. మీరు వాడే టూత్ పేస్ట్ ఉంటే చాలు. స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే పై ఏర్పడిన పగుళ్లపై కొద్దిగా టూత్ పేస్ట్ రాసి.. దానిపై కొద్దిసేపు సున్నితంగా రుద్దాలి. అలా చేసిన తర్వాత కొద్ది సమయం పాటు దాన్ని వదిలేసి.. ఆ తర్వాత దూదితో దాన్ని శుభ్రంగా తుడవాలి. డిస్ ప్లే పగుళ్లు పూర్తిగా తొలగిపోతాయి.
నెయిల్ పాలిష్ తో..
టూత్ పేస్ట్ తోనే కాకుండా.. ఇంట్లో ఉండే నెయిల్ పాలిష్ ద్వారా కూడా స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే పై ఏర్పడిన పగుళ్లను నివారించుకోవచ్చు. తొలుత స్కీన్ పగుళ్లపై నెయిల్ పాలిష్ ను వేయాలి. కాసేపు అది ఆరిపోయాక.. పదునైన రేజర్ బ్లేడ్ తో స్క్రాప్ చేయాలి. ఆ విధంగా డిస్ ప్లే పై ఉన్న నెయిల్ పాలిష్ ను తొలగించాలి. ఇలా చేయడం వల్ల మీ స్మార్ట్ ఫోన్ పై ఏర్పడిన పగుళ్లు తొలగిపోతాయి.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన టిప్స్ నుంచి గ్రహించినది. దీన్ని అనుసరించే ముందు స్మార్ట్ ఫోన్ రిపేర్ షాప్ లో సంప్రదిస్తే మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు)
Also Read: Egg White Benefits: గుడ్డులోని తెల్లని భాగాన్ని రోజూ తినడం వల్ల హైబీపీని నియంత్రించుకోవచ్చు!
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ నూనెను వాడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Smartphone Hacks: పగిలిన స్మార్ట్ ఫోన్ డిస్ ప్లేను ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు!