Number Plate Goes Viral: అవివాహితుడైన ఓ రాజకీయ నేతకు తాను మనవడిని అని ఓ యువకుడు తన బుల్లెట్ బైక్ నెంబరు ప్లేట్‌పై రాయించుకోవడం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఘటన తమిళనాడుకులో చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పెళ్లే అవ్వని ఎమ్మెల్యేకు మనవడు ఎలా వచ్చాడా..?? అని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. నాగర్‌కోయిల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ మనవడిని అంటూ అమ్రిష్ అనే యువకుడు తన బుల్లెట్ బైక్ నెంబర్ ప్లేట్‌పై రాయించుకున్నాడు. అయితే, నాగర్ కోయిల్ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ బ్రహ్మచారి కావడం విశేషం. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
మ్యారేజ్ కాకుండా మనవడు ఎలా వచ్చాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేయడంతో ఈ ఘటన హట్ టాపిక్‌గా మారింది. అయితే నాగర్ కోయిర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తూ వచ్చిన ఎంఆర్ గాంధీ 40 ఏళ్ల తర్వాత విజయం వరించింది.
అవివాహితుడైన ఎమ్మెల్యే తన కారు డ్రైవర్ కణ్ణన్‌నే తన సొంత మనిషిలా ఆప్యాయతగా చూసుకుంటారు. ఆ డ్రైవర్ కణ్ణన్ కొడుకే ఈ యువకుడు అమ్రిష్. కణ్ణన్‌ను గాంధీ ఓ కొడుకులా చూసుకోవడంతో అతడ్ని అమ్రిష్ తాతలా భావించి.. తాను ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ మనవడిని అంటూ చలామణి అవుతున్నట్టుగా సమాచారం.
Grandson of TN MLA do not need number plate and can violate traffic rules pic.twitter.com/aEnRrHTeTh
— SAI@SAA (@sainairv) March 14, 2022
నిజానికి చాలా నిరాడంబరంగా ఉంటాడు ఎమ్మెల్యే గాంధీ. అసెంబ్లీకి సాధారణ పౌరుడిలా సింపుల్‌గా వెళ్తారు. ఆయనకు ఇటువంటివి అస్సలు నచ్చదు. కానీ.. ఆయన మీద అభిమానంతోనే ఆ యువకుడు అలా బుల్లెట్ బైక్ నెంబర్ ప్లేట్ మీద తన పేరు రాయించుకున్నాడని బీజేపీ నేతలు నెటిజన్లను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.
తమిళనాడులో అధికార దుర్వినియోగం, సిగ్గుమాలినతనానికి ఇదో నిదర్శని కొందరు.. ఇది సినిమా కథలను తలదన్నేలా ఉందని మరి కొందరు, కామెంట్స్ చేయగా మరికొందరు.. 'మా తాత ఎవరో మీకు తెలియకపోతే నా నెంబరు ప్లేట్ మీద ఉంది' అన్నట్టుందని మండిపడుతున్నారు. కానీ ఆ యువకుడు చేసిన పనికి తీవ్రస్థాయిలో నెటిజన్లు మండిపడుతున్నారు. అమ్రిష్ చేసిన పనికి మీడియా ముందుకు వచ్చి నెటిజన్లుకు రిప్లే ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
Also Read: Chiranjeevi new Movie: మరో మలయాళం మూవీ రీమేక్‌లో చిరంజీవి?
Also Read: TTD Arjitha Seva: ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు- చివరి తేదీ ఎప్పుడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook