Telangana: తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని మోదీతో సమావేశం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలోని సమస్యల గురించి చర్చించినట్టు చెబుతున్నా..వేరే ఉద్దేశ్యాలున్నాయని తెలుస్తోంది.
తెలంగాణ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని మోదీతో మరోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రధాన సమస్యలను ప్రధాని మోదీకి వివరించానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..మోదీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. మూసి నదిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. గంగా నది తరహాలోనే మూసి నదిని ప్రక్షాళన చేయాలని మోదీని కోరారు. హైదరాబాద్-విజయవాడ ఆరు లైన్ల హైవే నిర్మాణంపై చర్చించామన్నారు. ఈఏడాదిలోనే పనులు మొదలు పెట్టాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.
విజయవాడ-హైదరాబాద్ ఆరులైన్ల హైవే నిర్మాణాన్ని జీఎంఆర్ చేపట్టకపోతే వేరే కొత్త సంస్థతో ఐనా చేపట్టాలని ప్రధాని దృష్టికి తెచ్చానన్నారు కోమటిరెడ్డి. నల్లొండ, మల్లెపల్లి, భువనగిరి, చిట్యాల రోడ్డుపై ప్రధాని మోదీతో చర్చించానని చెప్పారు. మూసీ నది ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతున్నా..ప్రయోజనం లేదని మండిపడ్డారు. తెలంగాణలో పెద్ద మైనింగ్ కుంభకోణం జరగుతోందని..సింగరేణి మైనింగ్‌పై ప్రధానికి వివరించినట్లు తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చినట్టు చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌డ్డి. తెలంగాణ ప్రభుత్వ అవినీతి గురించి ప్రధానికి వివరించానన్నారు. గతంలో కూడా ఓసారి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధాని మోదీని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిశారు. ఈసారి రాష్ట్రంలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో కొమటిరెడ్డి కలయిక కాస్త సందేహాల్ని రేపుతోంది.
Also read: Telangana Govt Jobs Notifications: తెలంగాణలో ఊరిస్తున్న ఉద్యోగాలు.. నోటిఫికేషన్ల గురించి ఎదురుచూపులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook