Puneeth Raj Kumar: పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతర గౌరవ డాక్టరేట్.. ప్రకటించిన మైసూర్ యూనివర్సిటీ

Puneeth Raj Kumar to get Honarary Doctorate: దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు మైసూర్ యూనివర్సిటీ మరణానంతర గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 04:17 PM IST
  • పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతర గౌరవ డాక్టరేట్
  • ప్రకటించిన మైసూరు యూనివర్సిటీ
  • పునీత్ తరుపున డాక్టరేట్ అందుకోనున్న ఆయన సతీమణి
Puneeth Raj Kumar: పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతర గౌరవ డాక్టరేట్.. ప్రకటించిన మైసూర్ యూనివర్సిటీ

Puneeth Raj Kumar to get Honarary Doctorate: దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు మైసూర్ యూనివర్సిటీ మరణానంతర గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. సినిమా రంగంలో పునీత్ అందించిన సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. మైసూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ హేమంత్ రావు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. గతంలో ఇదే మైసూర్ యూనివర్సిటీ పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌కు కూడా గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.

డాక్టరేట్ విషయమై ఇప్పటికే పునీత్ సతీమణి అశ్వినితో సంప్రదించామని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. పునీత్ తరుపున డాక్టరేట్‌ను అందుకునేందుకు ఆమె అంగీకరించినట్లు తెలిపారు. మార్చి 22న జరగబోయే వర్సిటీ 102వ కాన్వకేషన్ కార్యక్రమంలో పునీత్ రాజ్‌కుమార్‌కు డాక్టరేట్ ప్రధానం చేయనున్నట్లు చెప్పారు. పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా జేమ్స్ విడుదలకు సిద్ధమైన వేళ.. మైసూర్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రకటించడంతో ఫ్యాన్స్‌లో సంతోషం రెట్టింపయింది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్ 29న కన్నుమూసిన సంగతి తెలిసిందే. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్.. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ వల్లే పునీత్ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. పునీత్ హఠాన్మరణం కర్ణాటకనే కాదు దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా కనిపించే పునీత్ హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన కడసారి చూపు కోసం కర్ణాటక మొత్తం కదిలింది. అశ్రు నయనాల మధ్య పునీత్‌కు అంతా చివరి వీడ్కోలు పలికారు. గతంలో పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్ కూడా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే సకాలంలో వైద్యం అందడంతో ప్రమాదం తప్పింది. 

Also Read: India vs Sri Lanka 2nd Test: ముగిసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్...టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం..  

Also Read: India Vs Sri Lanka 2nd Test: శ్రేయస్ సెంచరీ మిస్... 252 పరుగులకు టీమిండియా ఆలౌట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News