Liquid Food Items: వేసవి వచ్చేసింది. అప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో ప్రధానంగా ఎదురయ్యే డీ హైడ్రేషన్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు కొన్ని ప్రత్యేకమైన పానీయాలు తప్పకుండా తీసుకోవల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు.
ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే మార్గాలు మనచుట్టూనే ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో ఎదురయ్యే సమస్యల్నించి రక్షించుకునేందుకు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు శరీరంలో వేడి పెరగకుండా చూసుకోవాలి. వేసవిలో తీసుకోవల్సిన పానీయాలేంటో చూద్దాం. ఎందుకంటే అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 38-40 డిగ్రీలుంటోంది.
వేసవిలో తప్పకుండా కన్పించే పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో నీటి శాతం ఎక్కువ కావడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పోతుంది. ఇందులో విటమిన్ ఎ, సి, బి6, లైకోపిన్, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల డైటింగ్‌కు ఇబ్బంది ఉండదు. ఇక కొన్ని ప్రాంతాల్లోనే లభించే తాటి ముంజలు. ఇందులో జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్,సెలీనియం వంటి పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తాయి. మరీ ముఖ్యంగా ఒంట్లో వేడి తగ్గుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య పోతుంది.
కీరా వేసవిలో తప్పకుండా అలవాటు చేసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరమంతా హైడ్రేట్‌గా ఉంటుంది. శరీరంలో ఉండే విషపదార్ధాలు బయటకుపోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన పండు ద్రాక్ష. ఇందులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఎండదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. ఇది శరీరానికి చలవ చేస్తుంది. సపోటా పండ్లు కూడా వేసవిలో ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.కేవలం నీటిశాతాన్ని పరిరక్షించడమే కాకుండా ఎనర్జీ లభిస్తుంది. ఇక ఇవన్నీ ఓ ఎత్తైతే తప్పకుండా తాగాల్సింది మజ్జిగ. వేసవిలో మజ్జిగ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. శరీరంలో వేడి తగ్గిస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరమౌతాయి.
Also read: Glowing Skin Tips: వేసవిలోనూ కాంతివంతమైన చర్మసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.