CM Bhupesh Baghel: బడ్జెట్ పత్రాలను 'ఆవు పేడ' సూట్​కేస్​లో తీసుకెళ్లిన సీఎం, ఫోటోలు వైరల్

CM Bhupesh Baghel:  రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సీఎం భూపేష్ బఘేల్..ఆవుపేడతో తయారుచేసిన సూట్​కేస్​తో చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి వెళ్లారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 07:48 PM IST
CM Bhupesh Baghel: బడ్జెట్ పత్రాలను 'ఆవు పేడ' సూట్​కేస్​లో తీసుకెళ్లిన సీఎం, ఫోటోలు వైరల్

Chhattisgarh CM Bhupesh Baghel carries cow dung brief case; ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (chhattisgarh budget session) సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సీఎం భూపేష్ బఘేల్ (CM Bhupesh Baghel)..ఆవుపేడతో తయారుచేసిన సూట్​కేస్​తో చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి (Chhattisgarh Assembly) వచ్చారు. ఈ సూట్​కేస్​లో బడ్జెట్​ పత్రాలను తీసుకొచ్చి శాసనసభలో  వార్షిక పద్దును ప్రవేశపెట్టారు సీఎం భూపేష్ బఘేల్. ఈ బ్రీఫ్‌కేస్‌ను 10 రోజుల పాటు రాయ్‌పూర్‌లోని ఓ పశువుల షెడ్ లో ఆవు పేడ పొడి, గమ్ , పిండి, ఇతర పదార్థాలతో కొండగావ్‌కు చెందిన కళాకారులు తయారుచేశారు. ఈ బ్రీఫ్‌కేస్‌పై సంస్కృతంలో 'గోమయే వసతే లక్ష్మి' అని రాసి ఉంది. దీని అర్థం 'ఆవు పేడలో లక్ష్మీదేవి నివశిస్తుంది'.

అంతకుముందు, భూపేష్ బఘేల్ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా విచ్చలవిడిగా తిరిగే పశువుల సమస్యను పరిష్కరించారు, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. 2020 ఛత్తీస్‌గఢ్‌ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం...ఆవుల పెంపకందారులు, రైతుల నుంచి ఆవు పేడను సేకరిస్తామని ప్రకటించింది. దీంతో దేశంలోనే తొలి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. గోధన్ న్యాయ్ యోజన, పేడ సేకరణ ద్వారా పశువుల యజమానులకు ఆదాయాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం. భూపేష్ బఘేల్ మాత్రమే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా అగ్రనేతలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఆవు పేడను ఉపయోగించాలని గతంలో పేర్కొన్నారు. 

Also Read: Mamata New Front: దేశంలో కొత్త రాజకీయ సమీకరణాలు, మమతా బెనర్జీ కొత్త ఫ్రంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News