Minister Srinivas goud on Murder Conspiracy: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై శ్రీనివాస్ గౌడ్ తొలిసారి స్పందించారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందునా ప్రస్తుతం దీనిపై తానేమీ మాట్లాడనని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో త్వరలోనే నిజానిజాలు వెలుగుచూస్తాయన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని.. గతంలో ఇలాంటి కేసులను పరిష్కరించిన సత్తా వారికి ఉందని అన్నారు.
మరోవైపు, ఈ కుట్ర కేసుపై సోమవారం (మే 7) మేడ్చల్ కోర్టులో విచారణ జరిగింది. నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా.. 4 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 8 మంది నిందితులను న్యాయవాది సమక్షంలోనే విచారించాలని.. వీడియో రికార్డు కూడా చేయాలని ఆదేశించింది.
కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌లోని షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంత్రి హత్యకు రూ.12 కోట్లు సుపారీ డీల్ కుదిరినట్లు పోలీసులు తేల్చారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌కి చెందిన రాఘవేంద్ర రాజు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. శ్రీనివాస్ గౌడ్ తమను ఆర్థికంగా దెబ్బతీసినందునే ఆయన్ను హత్య చేసేందుకు స్కెచ్ వేసినట్లు రాఘవేంద్ర రాజు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నాగయ్య, యాదయ్య, విశ్వనాథ్ అనే ముగ్గురు వ్యక్తులతో రాఘవేంద్ర రాజు సుపారీ డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ నలుగురితో పాటు మరో నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ పూర్తయితే కేసులో అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.
Also Read: Bheemla Nayak: చిత్తూరులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు షాక్... జంతు బలి కేసు నమోదు చేసిన పోలీసులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook