Indian Women team players playing with Pakistan Captain daughter: దాయాదులు భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. క్రికెట్ ఆటలో కూడా రెండు దేశాల మధ్య వైరం మాములుగా ఉండదు. ఆటగాళ్ల మధ్య కూడా పోటీపోటీ దూషణలు జరుగుతూ ఉంటాయి. మైదానంలోనే భావోద్వేగానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భారత మహిళా ప్లేయర్స్ అందరూ పాకిస్తాన్ కెప్టెన్ కుమార్తెతో సరదాగా ఆడుకున్నారు.
పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్‌కు ఆరు నెలల పాప (ఫాతిమా) ఉంది. వన్డే ప్రపంచకప్ 2022లో ఆడేందుకు పాక్ కెప్టెన్ తన కుమార్తెతో పాటు న్యూజిలాండ్ వచ్చారు. ఓ వైపు చిన్నారి ఆలనాపాలనా చూసుకుంటూనే.. మరోవైపు జట్టును ముందుకు నడిపిస్తున్నారు. ఇక ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాక.. మిథాలీ సేన పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి కాసేపు సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే బిస్మా తన కుమార్తెను భుజాలపై ఎత్తుకోగా.. భారత క్రికెటర్లు ఆ చిన్నారితో ఆడుకున్నారు.
భారత క్రికెటర్లు చిన్నారితో ఆడుకున్న తర్వాత సెల్ఫీలు దిగారు. బిస్మా మరూఫ్ తన కుమార్తెను ఎత్తుకోగా.. హర్మన్ ప్రీత్ కౌర్ సెల్ఫీ తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐసీసీ కూడా వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ నుంచి లిటిల్ ఫాతిమాకు మొదటి క్రీడాస్పూర్తి పాఠం' అని క్యాప్షన్ ఇచ్చింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఈ ఫోటోను చూసి ఆనందం వ్యక్తం చేశారు. తన ఫేస్‌బుక్‌లో ఆ ఫొటో షేర్ చేస్తూ.. 'ఎంతో మధురమైన క్షణం. క్రికెట్‌కు మైదానంలో బౌండరీలు ఉంటాయి కానీ మైదానం వెలుపల ఉండవు' అని పేర్కొన్నారు.
This is so WHOLESOME 🥺#INDvPAK pic.twitter.com/5SxEGmOI5K
— Ambreeeen.. (@Nostalgicc_A) March 6, 2022
ఆదివారం జరిగిన మ్యాచులో భారత్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పూజా వస్త్రాకర్ (67; 59 బంతుల్లో 8x4), స్నేహ్ రాణా (53 నాటౌట్; 48 బంతుల్లో 4x4), స్మృతి మంధాన (52; 75 బంతుల్లో 3x4, 1x6) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం భారీ ఛేదనకు దిగిన పాక్.. 137 పరుగులకే ఆలౌట్ అయింది. రాజేశ్వరి గైక్వాడ్ 4,వికెట్లు పడగొట్టారు.
Also Read: New Movies Update: ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదలయ్యే తెలుగు సినిమాలివే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook