Polavaram Project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సందర్శించారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని ఆయన అభివర్ణించారు. ప్రాజెక్టు ప్రతి పైసాను కేంద్రం చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రాజెక్టును, పునరావాస కాలనీలను సందర్శించారు. నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రాజెక్టు సందర్శన, అధికారులతో సమీక్ష అనంతరం అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితమే వచ్చిఉంటే..ఇంకా వేగంగా పనులు పూర్తయ్యేవని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఏదేమైనా..ప్రాజెక్టుకు ప్రతి రూపాయిని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని ఆయన అభివర్ణించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చెల్లించాల్సిన నిధులు మంజూరు చేయాలని అధికారుల్ని ఆదేశించినట్టు చెప్పారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం మరింత ముందుకెళ్లాని ఆకాంక్షించారు. అన్ని రకాల వైద్య సదుపాయాలున్న అమెరికా, యూరప్ దేశాలు కరోనాతో వణికిపోయాయని..ఇండియా మాత్రం దీటుగా ఎదుర్కొందని చెప్పారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. ఇండియాలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌ను ఇతర దేశాలు వినియోగిస్తున్నాయని గుర్తు చేశారు. ఏపీలో మాత్రం బీజేపీ ఇంకా చాలా బలపడాల్సి ఉందని చెప్పారు.
Also read: Polavaram Project: పోలవరం నిర్వాసితుల కాలనీ సౌకర్యాలపై కేంద్రమంత్రి ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook