'కెరటం' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో వెనక్కితిరిగి చూసుకొవాల్సిన అవసరం రాలేదు. లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్ మూవీస్‌లో నటించి స్టార్ హీరోయిన్గా మారారు.
వివాహానికి రకుల్ ప్రీత్ ఆల్ వైట్ బ్రాలెట్ మరియు లెహంగా ధరించారు. ఈ డ్రెస్సులో రకుల్ హాట్ హాట్‌గా ఉన్నారు. ఎద, నడుము, నాభి అందాలు కనిపించేలా డ్రెస్ ఉంది. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
రకుల్ ప్రీత్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి తాజాగా ఢిల్లీలో ఫిల్మ్ మేకర్ లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యారు. ఈ సమయంలో తాజ్ మహల్ వద్ద ఇద్దరు కలిసి సందడి చేశారు.
ఇటీవల మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి 'కొండపొలం' సినిమా చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్‌పై కన్నేశారు. బాలీవుడ్లో రకుల్ నటించిన 4-5 సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవుతున్నాయి. వాటిలో రెండు సినిమాలు సూపర్ హిట్ అయినా.. రకుల్ బాలీవుడ్లో సెటిల్ అయినట్టే.
ఇటీవలి కాలంలో టాలీవుడ్లో రకుల్ ప్రీత్ హవా కాస్త తగ్గిపోయింది. పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్ ,సాయి పల్లవి లాంటి హీరోయిన్లు సత్తాచాటుతుండడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి.