Indian Opener KL Rahul saves 11 Year old young cricketer: టీమిండియా క్రికెటర్లు ఆటగాలోనే కాదు సాయం చేయడంలో కూడా ముందుంటారు. రెండేళ్ల క్రితం కొరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన పేదవారి చికిత్స కోసం, తిండి లేక ఇబ్బంది పడిన ప్రజల కోసం భారత క్రికెటర్లు తమవంతు సాయం చేసిన విషయం తెలిసిందే. కొందరు స్వచ్చంద సంస్థలకు కూడా నిత్యం ఆర్థిక సాయం చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ 11 ఏళ్ల బాలుడి శస్త్ర చికిత్స కోసం భారీగా సాయం చేశాడు. వివరాల్లోకి వెళితే...
మహారాష్ట్రకు చెందిన 11 ఏళ్ల వరద్ నల్వాడే అనే పిల్లాడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. 2021 సెప్టెంబరు నుంచి ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. వరద్ తల్లిదండ్రులు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. తండ్రి సచిన్ నల్వాడే ఇన్సూరెన్స్ ఏజెంట్ కాగా.. తల్లి స్వప్న నల్వాడే గృహిణి. దాంతో పిల్లాడికి ఎముకలోని మజ్జా మార్పిడికి (బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్) శస్త్ర చికిత్స చేయించే స్థోమత లేదు. చేసేదిలేక తమ కుమారుడిని చికిత్స కోసం 'గివ్ ఇండియా' స్వచ్చంద సంస్థను ఆర్థిక సాయం కోరారు. ఈ విషయం తెలుసుకున్న కేఎల్ రాహుల్ శస్త్ర చికిత్స కోసం రూ.31 లక్షలు విరాళంగా ఇచ్చాడు.
విరాళం గురించి తాజాగా లోకేష్ రాహుల్ మాట్లాడుతూ... 'వరద్ పరిస్థితి గురించి తెలుసుకున్న మా బృందం గివ్ ఇండియాను సంప్రదించింది. చికిత్సకు అవసరమైన డబ్బు ఇస్తామని చెప్పాము. శస్త్రచికిత్స విజయవంతం అయి, వరద్ బాగానే ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుని అతడు తన కలలను సాకారం చేసుకుంటాడనుకుంటున్నా. నేను చేసిన ఈ చిన్న సాయం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నా. ఆపదలో ఉన్నవారిని మరింత మంది ఆదుకోవాలి' అని అన్నాడు.
తన కుమారుడి శస్త్ర చికిత్స కోసం సాయం అందించిన క్రికెటర్ కేఎల్ రాహుల్‌కి వరద్ తల్లి స్వప్న నల్వాడే ధన్యవాదాలు చెప్పారు. రాహుల్ సాయం చేయకుంటే ఇంత తక్కువ సమయంలో శస్త్ర చికిత్స సాధ్యమయ్యేది కాదని, అతడి సాయంకు మేము రుణపడి ఉన్నాం అని ఆమె అన్నారు. రాహుల్ భారత్ తరఫున 43 టెస్టులు, 42 వన్డేలు, 56 టీ20లు ఆడాడు.
Aslo Read: Horoscope Today Feb 23 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అధిక ధన వ్యయం తప్పదు!
Also Read: K.P.A.C. Lalitha Died: ఇండస్ట్రీని కుదిపేస్తున్న వరుస మరణాలు.. పరిశ్రమలో మరో నటి మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
గొప్ప మనసు చాటుకున్న టీమిండియా క్రికెటర్.. బాలుడి శస్త్ర చికిత్స కోసం రూ.31 లక్షల విరాళం!!
గొప్ప మనసు చాటుకున్న టీమిండియా క్రికెటర్
11 ఏళ్ల బాలుడి శస్త్ర చికిత్స కోసం రూ.31 లక్షల విరాళం
మరింత మంది ముందుకు రావాలి