Google Maps Offline: ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ యుగం. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లో నుంచే ఎన్నో పనులు చక్కబెట్టవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే గూగుల్ మ్యాప్స్ సాయంతో మీరు ఎక్కడికి వెళ్లాలన్నా రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్లవచ్చు. అయితే గూగుల్ మ్యాప్ నేవిగేషన్‌కి ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్‌ని ఎలా ఉపయోగించవచ్చో మీకు తెలుసా..
ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్ ఎలా ఉపయోగించాలి :
గూగుల్ మ్యాప్స్‌లో ఉండే 'గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్' ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్‌ని ఉపయోగించవచ్చు. దీని ద్వారా మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో.. ఆ మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఇంటర్నెట్ లేకుండానే నేవిగేషన్‌ని పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
1)మొదట గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయండి
2)కుడివైపు ఎగువ భాగంలో మీ ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేయండి
3)వచ్చిన ఆప్షన్లలో 'ఆఫ్‌లైన్ మ్యాప్స్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి
4)ఇప్పుడు 'సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్స్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి
5)మ్యాప్‌ను జూమ్ చేయడం ద్వారా మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ లొకేషన్‌ని ఎంచుకోండి.
6)మీరు ఎంపిక చేసుకున్న లొకేషన్ మ్యాప్ చుట్టూ బ్లూ బాక్స్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని డౌన్ లోడ్ చేసుకోండి.
7)డౌన్‌లోడ్ పూర్తయ్యాక.. ఇక ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆ మ్యాప్ నేవిగేషన్‌ని పొందవచ్చు. తద్వారా మీ ఇంటర్నెట్ డేటా సేవ్ అవుతుంది.
Also Read: Pawan Kalyan Rally: ర్యాలీలో అపశ్రుతి.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తప్పిన ప్రమాదం! (Video)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook