IRCTC New Rules: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. బోర్డింగ్ స్టేషన్ మార్పు విషయంలో ఐఆర్సీటీసీ కొత్త మార్పులు చేసింది. టికెట్ బుకింగ్ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
రైల్వే ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ కొత్త వెసులుబాటు కల్పిస్తోంది. టికెట్ బుక్ చేసుకున్న తరువాత బోర్డింగ్ స్టేషన్ చేరుకునే విషయంలో ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు చేసింది. ఇక నుంచి టికెట్ బుక్ చేసుకున్న తరువాత బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న స్టేషన్ నుంచి కాకుండా ఎక్కడి నుంచైనా రైలు ఎక్కవచ్చు. బోర్డింగ్ స్టేషన్ మార్పు కోసం టికెట్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకుంటే జరిమానా పడుతుంది.
సాధారణంగా చాలా సందర్భాల్లో టికెట్ బుక్ చేసుకున్న తరువాత బోర్డింగ్ స్టేషన్ మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బోర్డింగ్ స్టేషన్ దూరంగా ఉండటం లేదా ఆ సమయంలో వేరే ఊరిలో ఉండటం లాంటి వివిధ కారణాలతో రైలు మిస్సయ్యే అవకాశాలుంటాయి. ఆ పరిస్థితుల్లో బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. సమీపంలోని మరో స్టేషన్‌ను బోర్డింగ్ స్టేషన్‌గా మార్చుకోవచ్చు. ఆన్లైట్ టికెట్ తీసుకున్న ప్రయాణీకులందరికీ ఈ సౌకర్యం లభిస్తుంది. వికల్ప్ బుకింగ్ ప్రయాణీకులకు మాత్రం ఈ వెసులుబాటు వర్తించదని రైల్వే తెలిపింది.
రైలు బయలుదేరే 24 గంటల ముందు బోర్డింగ్ స్టేషన్ మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఒకసారి బోర్డింగ్ స్టేషన్ మార్చిన తరువాత..అసలు బోర్డింగ్ స్టేషన్ నుంచి రైలెక్కడం కుదరదు. అలాగని బోర్డింగ్ స్టేషన్ మార్చకుండా మరో స్టేషన్ నుంచి రైలెక్కితే..జరిమానాతో పాటు బోర్డింగ్ పాయింట్, సవరించిన బోర్డింగ్ పాయింట్ మధ్య వ్యత్యాసాన్ని చెల్లించాల్సి ఉంటుంది. బోర్డింగ్ స్టేషన్‌ను ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుంది.
బోర్డింగ్ స్టేషన్ ఎలా మార్చాలంటే
ముందుగా IRCTC అధికారిక వెబ్సైట్ https://www.irctc.co.in/nget/train ఓపెన్ చేయాలి. లాగిన్ అయిన తరువాత బుకింగ్ హిస్టరీకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఎక్కే రైలును ఎంచుకుని..ఛేంజ్ బోర్డింగ్ పాయింట్ ఆప్షన్‌కు వెళ్లాలి. మీరు ఎక్కే రైలు కొత్ బోర్డింగ్ స్టేషన్ ఎంచుకోవాలి. ఆ తరువాత నిర్ధారణ కోసం ఓకే క్లిక్ చేయాలి. అంతే..బోర్డింగ్ స్టేషన్ మారినట్టుగా మొబైల్ నెంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది.
Also read: LIC IPO and Share Price: ఎల్ఐసీ ఐపీవో మార్చ్ 11న లాంచ్ , ఒక్కొక్క షేర్ ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook