Ravi Bishnoi: రవి బిష్ణోయ్ సూపర్ స్పెల్, 17 డాట్ బాల్స్‌తో అరుదైన ఘనత

Ravi Bishnoi: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ క్రికెట్ టోర్నీలో రవి బిష్ణోయ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అరుదైన ఘనత సాధించాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2022, 12:13 PM IST
 Ravi Bishnoi: రవి బిష్ణోయ్ సూపర్ స్పెల్, 17 డాట్ బాల్స్‌తో అరుదైన ఘనత

Ravi Bishnoi: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ క్రికెట్ టోర్నీలో రవి బిష్ణోయ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అరుదైన ఘనత సాధించాడు.

వెస్టిండీస్‌లో టీమ్ ఇండియా పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు టీ20 సిరీస్‌పై దృష్టి సారించింది. వెస్టిండీస్‌తో నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సాధించిన ఘన విజయంలో టీమ్ ఇండియా బౌలర్ రవి బిష్ణోయ్ పాత్ర కీలకంగా మారింది.

వెస్టిండీస్ బ్యాటర్లు..రవి బిష్ణోయ్ గూగ్లీలు ఆడలేక చాలా ఇబ్బంది పడ్డారు. లెగ్ స్నిన్నర్‌గా రవి బిష్ణోయ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. టీ20 క్రికెట్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడు ఇతడు. తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్ధుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. రవి బిష్ణోయ్ అద్బుత బౌలింగ్‌తో టీ20 సిరీస్‌లో తొలి విజయం సాధించిన టీమ్ ఇండియా..సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. రవి బౌలింగ్‌లో పరుగులు సాధించలేక వెస్టిండీస్ బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. బిష్ణోయ్ 24 బంతులేయగా..అందులో 17 డాట్ బాల్స్ ఉండటం విశేషం. మొదటి మ్యాచ్‌‌లో ఉండే ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు తడబడి వైడ్స్ ఇచ్చినా..17 డాట్ బాల్స్ వేయడమంటే మాటలు కాదు. ఇదొక అరుదైన ఘనత. రాజస్థాన్‌కు చెందిన రవి బిష్ణోయ్ (Ravi Bishnoi)..ఇప్పటి వరకూ 42 దేశవాళీ టీ20 మ్యాచ్‌లలో 6.63 సగటు సాధించాడు. మొత్తం 49 వికెట్లు తీశాడు. అండర్ 19 2020 ప్రపంచకప్ బరిలో దిగిన ఆటగాళ్లలో టీమ్ ఇండియా తరపున ఆడిన తొలి ఆటగాడు ఇతడే.

Also read: Ranji Trophy 2022: రంజీ క్రికెడ్ నేడే ప్రారంభం, ఎన్ని జట్లు, ఎన్ని దశలు, ఎన్ని మ్యాచ్‌లు..ఇవే ఆ వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News