IND vs WI: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్నాళ్లు కోహ్లీని ప్రశాంతంగా వదిలేస్తే.. అంతా సర్దుకుంటుందని చెప్పుకొచ్చాడు. అతడు కాన్ఫిడెన్స్ కోల్పోలేదని.. ఒత్తిడిని జయించడం ఎలానో కూడా అతడికి బాగా తెలుసు అని చెప్పుకొచ్చాడు. అతడు టీమ్ ఇండియా కోసం ఎంతే శ్రమించాడని గుర్తు చేసుకున్నాడు రోహిత్.
మీరు వదిలేస్తే..
రేపటి నుంచి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ కోహ్లీ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు.
కోహ్లీ ఫామ్, వివాదాల గురించి వస్తున్న వార్తలకు కారణం మీడియానే అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. మీరు (మీడియా) కొన్నాళ్లు అతని గురించి (కోహ్లీ గురించి) పట్టించుకోకుంటే.. అన్ని అవే సర్దుకుంటాయని అభిప్రాయపడ్డాడు.
ఇక కోహ్లీ ఫామ్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు రోహిత్. కోహ్లీ ఒత్తిడిలో ఉన్నాడన్న వార్తలను ఖండిచాడు. కోహ్లీ పదేళ్లకుపైగా ఇంటర్నేషనల్ టీమ్‌లో ఉన్నాడన్నాడు రోహిలత్. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లలో చాలా టైమ్ కేటాయించాడని కాబట్టి ఒత్తిడిని ఎలా అదుపులో ఉంచుకోవాలో కోహ్లీకి చాలా బాగా తెలుసని స్పష్టం చేశాడు. మళ్లీ మళ్లీ కోహ్లీ ఫామ్ గురించి అడగటం బాగోలేదని రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు.
ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో కోహ్లీ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. వన్డే ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. అయితే కోహ్లీ రికార్డు స్థాయిలో ఇప్పటిప వరకు 44 సెంచరీలు చేయడం విశేషం.
ఇక టీ20 మ్యాచ్‌లు ఇలా..
రేపటి నుంచి (ఫిబ్రవరి 16) ఇండియా-వెస్టిండీస్ మధ్య టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు మ్యాచ్‌లు కోల్‌కతా వేదికగానే జరగనున్నాయి. ఇప్పటికే వన్డేలో వెస్టిండీస్‌ను 3-0 తేడాతో ఓడించిన టీమ్ ఇండియా.. టీ20లోనూ ఆదిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ఇక వన్డే సిరీస్‌తో భంగపాటుకు గురగైన విండీస్ జట్టు.. ఈ సిరీస్‌లో ప్రతీకారం తీసుకోవాలని భావిస్తోంది.
Also read: Maxwell Wedding Card: భారతీయురాలితో క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వివాహం.. వెడ్డింగ్ కార్డు వైరల్!
Also read: India vs West Indies : టీమిండియా వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook