Bihar Student Valentine day Campaign: వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక యువకుడు వినూత్న ప్రచారం చేపట్టాడు. రెంట్‌కు బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు అంటూ ప్లకార్డ్ పట్టుకుని ప్రచారం చేశాడు. ఊరంతా తిరిగాడు. ఇక అతడు ఇలా చేయడం వెనుక ఒక రీజన్ ఉంది.
ఈ ఘటన బిహార్‌లోని దర్భంగాలో జరిగింది. దర్భంగా ఇంజనీరింగ్ కాలేజీలో చదివే ప్రియాన్షు అనే స్టూడెంట్ ఇలాంటి వినూత్న క్యాంపెయిన్ చేపట్టాడు. బాయ్‌ఫ్రెండ్ ఆన్ రెంట్ అనే ప్లకార్డ్‌తో అతను దర్భంగాలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రచారం చేపట్టాడు.
ఇక ఈ విషయంపై ప్రియాన్షు ఏమన్నాడంటే.. చాలా మంది యూత్.. తమ యవ్వనాన్ని అంతా కూడా బాయ్ ఫ్రెండ్స్ కోసమో లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ కోసమో వేస్ట్ చేస్తుంటారు అన్నారు. యువత మొత్తం కూడా దేశ అభివృద్ధిలో భాగం కావాలంటూ ప్రియాన్షు పేర్కొన్నాడు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటూ టైమ్ వేస్ట్ చేయొద్దు అనే సందేశం ఇచ్చేందుకే తాను ఇలాంటి వినూత్న క్యాంపెయిన్ నిర్వహించానన్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియాన్షు ఇచ్చిన ఈ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఒంటరిగా ఉన్నామని భావించే యూత్‌లో చిరునవ్వు తెప్పించేందుకు ఇలా చేశానని ప్రియాన్షు అన్నారు. అంతేకాదు యూత్ తమను ప్రేమను ప్రజలకు పంచాలన్నారు. కానీ నేటి యూత్ మాత్రం ఒత్తిడికి లోనవుతూ ఇబ్బందిపడుతున్నారన్నారు.
డిప్రెషన్లోకి వెళ్లే యూత్ చాలా ఎక్కువ మందే ఉన్నారన్నారు. సింగిల్‌గా ఉండేటటువంటి యువతకు ప్రేమను పంచడమే తన లక్ష్యమన్నారు. అంతేకాదు ప్రియాన్షు గతంలో కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాడు. క్రిస్మస్ సందర్భంగా ఫ్రీ హగ్ అంటూ ఇలాగే వినూత్నంగా క్యాంపెయిన్ నిర్వహించాడు.
Also Read: AP Corona: ఏపీలో తగ్గుతున్న కొవిడ్ తీవ్రత- నైట్ కర్ఫ్యూ ఎత్తేసిన ప్రభుత్వం
Also Read: New NCA Building: నేషనల్ క్రికెట్ అకాడమీకి శంకుస్థాపన చేసిన గంగూలీ, జై షా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook