Russia Ukraine Conflict: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై ఈ నెల 16న రష్యా దాడి చేయబోతుందని ఇప్పటికే అమెరికా నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం (ఫిబ్రవరి 12) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. సుమారు గంట పాటు ఈ ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగింది.
ఈ సందర్భంగా యుద్ధాన్ని విరమించుకోవాలని పుతిన్‌ని కోరిన బైడెన్.. ఒకవేళ దుందుడుకుగా వ్యవహరిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణ చర్యలకు పాశ్చాత్య దేశాలు ప్రతిస్పందిస్తాయని.. అదే జరిగితే రష్యా ఒంటరి కాక తప్పదని హెచ్చరించారు. దీనికి సంబంధించి వైట్ హౌస్ వర్గాల నుంచి ఒక ప్రకటన కూడా విడుదలైంది.
'అధ్యక్షుడు బైడెన్ చాలా క్లియర్‌గా ఉన్నారు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తితే అమెరికా దాని మిత్ర దేశాలు వెంటనే సమిష్టిగా స్పందిస్తాయి. రష్యాపై తీవ్ర ఆంక్షలు విధిస్తాయి. మొత్తంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడితే.. అది మానవాళికి తీరని నష్టం కలిగిస్తుంది. యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతోంది. మిత్ర దేశాలతో కలిసి ఇతర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని పుతిన్ చెప్పినప్పటికీ.. ఆ దేశ సరిహద్దులో ఇప్పటికే లక్ష మంది రష్యా సైనికులను మోహరించడం వాస్తవ పరిస్థితులను అద్దం పడుతోంది. ఇప్పటికే అమెరికా సహా బెల్జియం, ఇజ్రాయెల్, పోర్చుగల్, కెనడా తదితర దేశాలు.. ఉక్రెయిన్‌లోని తమ పౌరులను వెనక్కి రావాలని విజ్ఞప్తి చేశాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో బెర్లిన్‌లో ఉక్రెయిన్-రష్యా మధ్య దౌత్యపరమైన చర్చలు జరిగినప్పటికీ.. అవి అసంపూర్ణంగానే ముగిశాయి. దీంతో ఉక్రెయిన్-రష్యా మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read: SVP Song Leak: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన తమన్.. తనవల్ల కావట్లేదంటూ ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook