India All Out for 265 Runs in 3rd ODI vs West Indies: మూడు వన్డే సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డే మ్యాచులో భారత్ 265 పరుగులకు ఆలౌట్ అయింది. నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. విండీస్ ముందు 266 పరుగుల లక్ష్యంను ఉంచింది. టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్ (80; 111 బంతుల్లో 9x4), రిషబ్ పంత్ (56; 54 బంతుల్లో 6x4, 1x6) అర్ధ శతకాలతో రాణించారు. ఇన్నింగ్స్ చివరలో బౌలర్లు దీపక్ చహర్ (38), వాషింగ్టన్ సుందర్ (33) కీలక పరుగులు చేశారు. విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ 4 వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్నటీమిండియాకి ఆరంభంలోనే భారీ షాకులు తగిలాయి. అల్జారీ జోసెఫ్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ (13) బౌల్డ్ కాగా.. ఐదో బంతికి మాజీ సారథి విరాట్ కోహ్లీ డకౌటయ్యాడు. ఆడుకుంటాడనుకున్న మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఓడీన్ స్మిత్ వేసిన 10వ ఓవర్లో క్యాచ్ ఔటయ్యాడు. దీంతో భారత్ 42 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ భారత ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. మొదటలో ఆచితూచి ఆడిన ఈ జంట.. ఆపై వేగం పెంచారు. పంత్ ఎప్పటిలానే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించాడు. అయ్యర్, పంత్ కలిసి నాలుగో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత పంత్ కీపర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (6) కూడా ఆకట్టుకోలేదు.
ధాటిగా ఆడే క్రమంలో శ్రేయాస్ అయ్యర్ బ్రావోకి చిక్కాడు. దాంతో 187 పరుగులకే భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. భారత్ 200 పరుగులు అయినా చేస్తుందా అనిపించింది. అయితే ఇన్నింగ్స్ చివరలో దీపక్ చహర్ (38), వాషింగ్టన్ సుందర్ (33) ధాటిగా ఆడడంతో భారత్ పోరాడే స్కోర్ చేసింది. కుల్దీప్ యాదవ్ (5), మహమ్మద్ సిరాజ్ (4) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు, అల్జారీ జోసెఫ్, హేడెన్ వాల్ష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
Also Raed: IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ?.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!!
Also Read: Viral Video: ఆడ నాగు కోసం.. రెండు మగ నాగుల మధ్య 5 గంటల భీకర యుద్ధం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Innings Break!#TeamIndia post 265 on the board in the third & final @Paytm #INDvWI ODI!
8⃣0⃣ for @ShreyasIyer15
5⃣6⃣ for @RishabhPant17
3⃣8⃣ for @deepak_chahar9
3⃣3⃣ for @Sundarwashi5Over to our bowlers now. 👍 👍
Scorecard ▶️ https://t.co/9pGAfWtQZV pic.twitter.com/5DygXyCboX
— BCCI (@BCCI) February 11, 2022
IND vs WI 3rd ODI: ఆదుకున్న అయ్యర్, పంత్.. 265 పరుగులకు భారత్ ఆలౌట్!!
వెస్టిండీస్‌తో మూడో వన్డే
265 పరుగులకు భారత్ ఆలౌట్
వెస్టిండీస్ లక్ష్యం 266