Airtel Xtream Premium దేశంలో సరికొత్తగా ఆల్ ఇన్ వన్ ఓటీటీ యాప్ లాంచ్ చేసింది. ఒకే సబ్ స్క్రిప్షన్తో 15 ఓటీటీ సేవలం పొందవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం పేరుతో కొత్తగా ప్రవేశపెట్టిన ఆల్ ఇన్ వన్ ఓటీటీ యాప్‌లో దేశంలోనివే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 ఓటీటీ వేదికలుంటాయి. ఫలితంగా పదివేలకు పైగా సినిమాలు, టీవీ షోలు చూసే అవకాశం కలుగుతుంది. ఏడాదికి 20 మిలియన్ల ఖాతాదారుల్ని టార్గెట్‌గా చేసుకుంది.
ఓటీటీ అనేది దేశంలో ఎంటర్టైన్మెంట్ దశను మార్చేసింది. గణాంకాలు స్పష్టంగా అదే చెబుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 350 మిలియన్ల ఓటీటీ వినియోగదారులున్నారని నివేదికలు చెబుతున్నాయి. 2025 నాటికి ఈ సంఖ్య 5 మిలియన్లకు చేరుకోవచ్చనేది అంచనా. ఓటీటీ స్పేస్‌లో వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఎయిర్టెల్ మల్టిపుల్ సబ్‌స్క్రిప్షన్‌తో ఆన్ ఇన్ వన్ సేవల్ని అందించేందుకు సిద్దమైంది. అందుకే ఎయిర్టెల్..ఎక్స్ట్రీమ్ ప్రీమియంను లాంచ్ చేసింది. ఒకే వేదికపై 15 ఓటీటీ యాప్ సేవలతో.
ఈ పదిహేను ఓటీటీల (OTT) జాబితాలో సోనీ లివ్, ఎరోస్ నౌ, లియోన్స్గేట్ ప్లే, హైకోయ్, మనోరమా మ్యాక్స్, షెమారూ, అల్ట్రా, హంగామా ప్లే, ఎపికాన్, డాక్యుబే, డివో టీవీ, క్లిక్, నమ్మాఫ్లిక్స్, డాలీవుడ్, షార్ట్స్ టీవీలు ఉన్నాయి. ఓటీటీ రంగంలో సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లడంలో, కంటెంట్ డిస్కవరీలో సవాళ్లు, తట్టుకుని నిలబడగలగడం, పంపిణీ, యూజర్లను ఆకట్టుకోవడం వంటివి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియంతో సాధ్యం కానుందని ఎయిర్టెల్ వెల్లడించింది. ప్రతి నెలా పలు ఓటీటీలకు చెల్లింపులు చేసేబదులు..మల్టిపుల్ సబ్స్క్రిప్షన్లతో ఇదొక మంచి ప్రత్యామ్నాయం కాగలదంటోంది. ఇంట్రోడక్టరీ ఆఫర్ కింద ఎయిర్టెల్ వినియోగదారులు ఈ సేవల్ని నెలకు 149 రూపాయల్నించి ఏడాదికి 1499 రూపాయల వరకూ పొందవచ్చు.
Also read: 10 rupees Coin: రూ.10 నాణెం పక్కా చెల్లుతుంది.. కేంద్రం క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook