Darshan to play younger version of Mahesh Babu: టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఫామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న రిలీజ్ కాబోతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరిన 14న 'సర్కారు వారి పాట' చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు.
'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్‌లో హీరో సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ నటించాడట. ఈ విషయాన్ని సుధీర్ బాబు తాజాగా వెల్లడించారు. సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన చిన్న కుమారుడు సర్కారు వారి పాటలో నటించాడు అని తెలిపాడు.
'సినీ కెరీర్ పరంగా నేను ఎప్పుడూ మహేష్ బాబు, కృష్ణ గారిని సహాయం అడగలేదు. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఓ సినిమాలో నటించేప్పుడు ఎలా కష్టపడాలో వారి దగ్గర నుంచే నేర్చుకున్నా. నాలానే నా ఇద్దరు కుమారులు చరిత్, దర్శన్‌లకు కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. హర్షవర్ధన్ దర్శకత్వంలో నేను చేస్తోన్న ఓ సినిమాలో చరిత్ నా చిన్ననాటి క్యారెక్టర్ చేశాడు. మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమాలో జూనియర్ మహేశ్‌గా దర్శన్ కనిపించబోతున్నాడు' అని మహేష్ బావ సుధీర్ బాబు చెప్పాడు.
'సర్కారు వారి పాట' సినిమాలో సుధీర్ బాబు తనయుడు దర్శన్ జూనియర్ మహేష్ బాబుగా కనిపించబోతున్నాడు అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉండబోతున్నట్లు స్పష్టం అయింది. మరి దర్శన్ ఎలా నటిస్తాడో చూడాలి. దర్శన్ ఇప్పటికే 2018లో వచ్చిన అడివి శేష్ స్పై థ్రిల్లర్ 'గూడాచారి'లో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Deepak Hooda: నా చిన్ననాటి కల నెరవేరింది.. విరాట్ కోహ్లీకి థాంక్స్: దీపక్ హుడా
Also Read: IND vs WI: భారత్‌లో ఇలాంటి స్పెల్ ఎప్పుడూ చూడలేదు.. అతడు అద్భుత బౌలర్: రోహిత్ శర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook