Coffee Side Effects: అతిగా కాఫీ తాగడం వల్ల నిద్రలేమి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే! కానీ మీరు ఎక్కువగా కాఫీ తాగడం ప్రారంభిస్తే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. నేటి జీవనశైలిలో భాగంగా ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత చాలా మందికి కాఫీ తాగడం అలవాటుగా వస్తోంది.
మరోవైపు చాలా మంది పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కాఫీని తాగుతారు. రోజుకు ఆరు కప్పుల కాఫీ డిమెన్షియా వంటి మెదడు వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీనితో పాటు అదనంగా.. గుండెపోటు, అధిక రక్తపోటుతో సహా ఇతర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర రాదు..
పొద్దున్నే నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. కాఫీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన నిద్ర అందదు. దీంతో నిద్రలేమి వస్తుంది. అలా కెఫిన్ అనే పదార్థం ఉన్న కాఫీని తాగడం వల్ల మీ నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉంది.
కడుపులో గ్యాస్ పెంచుతోంది..
కాఫీ తాగడం వల్ల మీ నిద్రకు భంగం వాటిల్లడం సహా మీ కడుపులో కొత్తగా గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. కాఫీ వల్ల శరీరంలో అనేక ప్రతికూలతల ప్రభావాన్ని ఎదుర్కొంటాయి. కాఫీలోని ఉండే పదార్థాలు గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ ను కడుపులో విడుదల చేస్తాయి. దీంతో అది జీర్ణాశయంపై ప్రభావం చూపుతోంది.
గుండెపోటు రోగులు జాగ్రత్త వహించాలి..
వైద్యుడి సలహా లేకుండా గుండెపోటు సమస్య ఉన్నవారు కాఫీ తాగకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది రక్తపోటును అమాంతం పెంచుతుంది. హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఉన్న రోగి శరీరంలోని కణాలను దెబ్బతీస్తుంది. దీంతో గుండెకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ కారణంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కొందరు వైద్యులు చెప్పిన సూచనలు ఆధారంగా రాసినది. దీన్ని పాటించే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.
Also Read: Diabetes Reduction Diet: రక్తంలో చక్కెర స్థాయి తగ్గాలంటే ఈ ఆహార నియమాలు పాటించండి!
Also Read: Almond Milk Benefits: బాదంపాలు తాగడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Coffee Side Effects: ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా?