Srivalli English song: అల్లు అర్జున్ హీరోగా, రశ్మికా మందాన్న హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుప్ప- ది రైజ్' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో పాటలు కూడా అంతే సూపర్ హిట్ అయ్యాయి.
ఇంకా చెప్పాలంటే.. పాన్ ఇండియా సినిమాగా గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా పాటలు అన్ని భాషల్లోనూ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే వినిపిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన.. ఈ పాటలు తాజాగా ఖండాంతరాలు దాటాయి.
విదేశాల్లోనూ క్రేజ్..
విదేశాల్లో సైతం చాలా మంది పుష్ప పాటలను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో ఓ పాటను ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి మరీ పాడారు ఓ యూట్యూబ్ సింగర్. తెలుగులో ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు.
తెలుగు మిక్స్డ్ ఇంగ్లీష్ లిరిక్స్..
emmaheesters అనే యూట్యూబర్ పుష్ప సినిమాలోని 'శ్రీవల్లి' పాటను ఇంగ్లీష్‌లోకి అనువదించి పాడింది. అయితే అమె పాటలో 'చూపే బంగారమాయేనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయేనే..' అనే లిరిక్స్‌ను తెలుగులోనే పాడటం విశేషం. మిగతా భాగాన్ని ఇంగ్లీష్‌లోకి అనువదించించి పాడింది.
అమె స్టైల్లో ఈ పాటకు మ్యూజిక్ జోడించి పాడింది. ఒరిజినల్ సాంగ్‌లో ఉన్న ఫీల్‌ను కూడా అమె పాటలో ఉండటం విశేషం.
ఈ పాటను ఫిబ్రవరి 4న యూట్యూబ్‌లో పెట్టగా.. ఇప్పటికే 5.20 లక్షల మంది వీక్షించారు. 58 వేల మందికిపైపగా లైక్ చేశారు.
ఇక ఈ పాట విన్న ఇండియన్స్ అంతా.. కామెంట్స్‌లో emmaheesters పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరికొందరు తెలుగు పాట ఖండాలు దాటిందంటూ స్పందిస్తున్నారు.
మొత్తానికి శ్రీ వల్లి ఇంగ్లీష్ వర్షన్ పాటకు ప్రశంసలు దక్కుతున్నాయి. మరి ఆ పాటను మీరు వినేయండి.
Also read: Jayasudha: టాలీవుడ్‌ను వదలని కరోనా.. సహజనటి జయసుధకు పాజిటివ్..!
Also read: F3 First Lyrical Song: మనీకి అంతం లేదు.. ఈ MONEY ANTHEM కి తిరుగు లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook