Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధరల్లో వరుసగా రెండవ రోజు స్వల్ప తగ్గుదల నమోదైంది. గత కొద్దిరోజుల్నించి పెరుగుతున్న బంగారం ధరలో మార్పు కన్పించింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 1, 2022, 07:00 AM IST
Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధరల్లో వరుసగా రెండవ రోజు స్వల్ప తగ్గుదల నమోదైంది. గత కొద్దిరోజుల్నించి పెరుగుతున్న బంగారం ధరలో మార్పు కన్పించింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు చాలా కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మద్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు పరిశీలిద్దాం. (Today February 1, 2022 Gold Rate in Different Cities of india)

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 9 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 990 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 9 వందలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 990 రూపాయలుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 270 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 390 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 9 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 9 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 990 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 9 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 990 రూపాయలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో  బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 9 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 990 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 4 వందలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 990 రూపాయలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 4 వందలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 990 రూపాయలుంది.

Also read: Stock Market today: బడ్జెట్​ 2022 ముందు బుల్ జోరు- భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News