Horrific Video in Bangalore: బెంగళూరులో ఓ కుక్కపై.. ఆడి కారులో వెళ్తోన్న వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. వీధికుక్కపై కర్కశత్వంగా ప్రవర్తించాడు అతను. గత బుధవారం బెంగళూరులో ఒక కాలనీలో రోడ్డుపై కొన్ని వీధి కుక్కలు నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డుపై ఒక వైట్ ఆడి కారులో (Car) వెళ్తోన్న వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన కారును కొంత రివర్స్ తీసుకుని వేగంగా ముందుకు దూసుకొచ్చాడు ఆ కారులో ఉన్న వ్యక్తి. తర్వాత కావాలని కుక్కపై (Dog) కారును ఎక్కించి ముందుకు దూసుకెళ్లాడు. కుక్కను తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు.
ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీ (CCTV Footage) చూసిన వారంతా షాక్ అయ్యారు. ఆడి కారులో వచ్చిన వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడా అని షాక్ అయ్యారు.
ఇక కుక్కకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఇందుకు కారణమైన ఆడి కారు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకుని అక్కడి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పరిశీలించాక.. ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు.
Audi car driver allegedly ran over a stray dog at Jayanagar 1st block in Bengaluru. pic.twitter.com/sWtDfxBxPG
— Chiranthan Gowda (@kingCG555) January 31, 2022
ఇక గతంలో కూడా ఇలా కుక్కలపై కొందరు క్రూరులు దారుణాలకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఒక వ్యక్తి వీధికుక్కను (Stray Dog) దారుణంగా కొట్టి చంపిన వీడియో కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది. ఆ క్రూరుడు కర్రలు, రాళ్లతో కుక్కను దారుణంగా కొట్టాడు. అది చనిపోయినా కూడా దాన్ని కర్రతో చాలా దారుణంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్వాలియర్‌లోని చార్ షహర్ స్క్వేర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంటి బైస్ అనే నిందితుడు ఈ క్రూరత్వానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అలాగే గతేడాది ముంబైలో (Mumbai) కూడా కుక్కపై ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ముంబైలో డిసెంబర్ 25వ తేదీ రాత్రి ఓ కుక్క పురుషాంగాన్ని గుర్తు తెలియని వ్యక్తి కట్ చేశాడు. ఈ ఘటన ఈస్ట్ అంధేరిలోని కపస్వాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. కుక్క (Dog) మేటింగ్‌లో ఉన్న సమయంలో ఆ నీచుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ కుక్కను పరేల్‌లోని బాంబే సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ సెంటర్‌కు తరలించారు. అక్కడున్న వెటర్నరీ డాక్టర్ ఆ కుక్కను (Dog) రక్షించేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ నిర్వహించారు.
Also Read: IPL 2022 Auction: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి సురేష్ రైనా.. ధర ఎంతో తెలుసా?!!
Also Read: Salman -Katrina: కత్రినా కైఫ్ వివాహంపై స్పందించిన సల్మాన్ ఖాన్.. ఇంతకీ ఏమన్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook