Covid 19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించిన 65 ఏళ్ల వ్యక్తి.. కారణం ఏం చెప్పాడో తెలుసా? నవ్వులే పో!!

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో 65 ఏళ్ల కుడియన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరించాడు. తాను డయాబెటిస్‌తో బాధపడుతున్నానని, తన 8 మంది పిల్లలను ఎవరు చూసుకుంటారు అని ఆరోగ్య అధికారులతో వాదించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 10:56 AM IST
  • కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించిన 65 ఏళ్ల వ్యక్తి
  • కారణం ఏం చెప్పాడో తెలుసా?
  • నా 8 మంది పిల్లలను ఎవరు చూసుకుంటారు
Covid 19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించిన 65 ఏళ్ల వ్యక్తి.. కారణం ఏం చెప్పాడో తెలుసా? నవ్వులే పో!!

Kudiyan refused to take Covid-19 vaccine in Tamil Nadu: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండనం చేస్తోంది. భారత దేశంలో కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెపుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి పల్లెలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా నిర్వహిస్తున్న్నాయి. అయినా కూడా కొంత మంది వ్యాక్సిన్ తీసుకోవడం లేదు. వారు చెప్పే సాకులు నవ్వులు పూయిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో 65 ఏళ్ల వ్యక్తి కోవిడ్ 19 వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరించాడు.

తిరుపత్తూరు జిల్లా పిచనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి పాంచలాయి మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు టీకాలు వేయడానికి పూరికమణిమిట్ట పంచాయతీకి వెళ్లారు. పూరికమణిమిట్టలో 1159 మంది ఉండగా.. 1158 మంది టీకాలు వేసుకున్నారు. 65 ఏళ్ల కుడియన్ అనే వ్యక్తి కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోలేదు. వ్యాక్సిన్ వేసేందుకు కుడియన్ ఇంటికి వెళ్లగా.. అతడు నిరాకరించాడు. టీకా వేసుకోనని నానా హంగామా చేశాడు. 

తాను డయాబెటిస్‌తో బాధపడుతున్నానని, తన 8 మంది పిల్లలను ఎవరు చూసుకుంటారు అని కుడియన్ ఆరోగ్య అధికారులతో వాదించాడు. ఎన్నో ఏళ్లుగా తనకు ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదని, కుల ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వలేదని ఆరోగ్య కార్యకర్తలతో వాదించాడు. అక్కడే ఉన్న పంచాయతీ అధ్యక్షుడు పరమశివం కుడియన్ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పాడు. దాంతో అతడు  వ్యాక్సిన్ వేసుకునేందుకు ఒప్పుకున్నాడు. చివరకు ఆరోగ్య కార్యకర్తలు కుడియాన్‌కు వ్యాక్సిన్‌ వేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 

Also Read: AP Temperatures: రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, భారీగా పొగమంచు

Also Read: Gannavaram Airport: గన్నవరం ఎయిర్ పోర్టులో భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News