Creativity in applying for Job: గుంపులో ఒకరిగా కాకుండా... మిగతావాళ్లకు భిన్నంగా, క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్లు త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. యూకెకి చెందిన 24 ఏళ్ల జొనాథన్ స్విఫ్ట్ ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న జొనాథన్.. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా ఆ దిశగా ప్రయత్నం చేశాడు. అనుకున్నట్లు గానే ఆ కంపెనీ యాజమాన్యం దృష్టిలో పడటమే కాదు... ఉద్యోగం కూడా సంపాదించాడు.
జొనాథన్ స్విఫ్ట్ వృత్తిపరంగా ప్రింటింగ్ స్పెషలిస్ట్. కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో యూకెలోని యార్క్‌షైర్‌లో ఉన్న ప్రముఖ ప్రింటింగ్ కంపెనీ 'ఇన్‌స్టాప్రింట్'లో వేకెన్సీ ఉన్నట్లు తెలుసుకున్నాడు. అయితే అందరి లాగా కేవలం తన రెజ్యుమ్‌ను ఆ కంపెనీ మెయిల్‌కి ఫార్వార్డ్ చేసి ఊరుకోలేదు. ఆ కంపెనీ గతంలో ముద్రించిన ఫ్లయర్స్ (సింగిల్ షీట్ ప్రింట్స్)ను సేకరించి వాటిని రీసైకిల్ చేశాడు. ఆపై అవే ఫ్లయర్స్‌పై తన రెజ్యుమ్‌ను ప్రింట్ చేశాడు.
ఆ తర్వాత ఒకానొక రోజు ఆ కంపెనీ పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లి... అక్కడ పార్క్ చేసి ఉన్న ప్రతీ కారుపై తన రెజ్యుమ్‌ను ముద్రించిన ఫ్లయర్స్‌ను ఉంచాడు. అలా ఆ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ క్రెయిగ్ వాసెల్ దృష్టిలో పడ్డాడు. క్రెయిగ్ వెంటనే జొనాథన్‌ను ఇంటర్వ్యూకి పిలిపించగా... ప్రింటింగ్ స్పెషలిస్ట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిపోయాడు. దాదాపు 140 మంది ఆ ఉద్యోగానికి అప్లై చేయగా... డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా ప్రయత్నించిన జొనాథన్‌కే ఉద్యోగం రావడం విశేషం. జొనాథన్ ఆ కంపెనీ పార్కింగ్ ప్రదేశంలోని కార్లపై తన రెజ్యుమ్ ముద్రించిన ఫ్లయర్స్‌ను ఉంచుతున్న వీడియోని (Viral Video) ఇన్‌స్టాప్రింట్ కంపెనీ తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Here’s some CCTV footage of the #jobseeker in action! He’s been the talk of the office since covering everyone's cars in CVs. I love it when we get a #creativejobapplication - Craig, Marketing Manager pic.twitter.com/OmE5puQgwI
— instantprint (@instantprintuk) January 18, 2022
Also Read: Budget 2022: రేపటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ సారి కాస్త ప్రత్యేకం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook