Telangana Corona cases: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. శనివారం సాయంత్రం 5.30 నుంచి ఆదివారం సాయంత్రం 5.30 వరకు రాష్ట్రంలో 2,484 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,61,050గా ఉంది.
జీఎహెచ్ ఎంసీ పరిధిలో మొత్తం 1,045 కేసులు నమోదైనట్లు తెలిపింపది ఆరోగ్య విభాగం.
రాష్ట్ర వ్యాప్తంపగా 65,263 టెస్టులకుగానూ.. ఈ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల సంఖ్య భారీగా తగ్గింది.
పెరిగిన రికవరీలు..
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కరోనా రికవరీలు కూడా భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో మొత్తం 4,207 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,18,241 మంది కరోనాను జయించారు.
మరణాలు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా శని-ఆదివారాల మధ్య (సాయంత్రం 5.30 వరకు) ఒకరు మృతి చెందారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ మృతుల సంఖ్య 4,086 వద్దకు చేరింది.
ఇక రాష్ట్రంలో ఇంకా 38,723 మంది కొవిడ్ చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా ఇలా..
- అదిలాబాద్- 26
- భద్రాద్రి కొత్తగూడెం- 43
- జగిత్యాల- 40
- జనగామ- 26
- జయశంకర్ భూపాలపల్లి- 10
- జోగులాంబ గద్వాల- 12
- కామారెడ్డి- 80
- కరీంనగర్-80
- ఖమ్మం-107
- కొమురం భీమ్ ఆసిఫాబాద్-12
- మహబూబ్‌నగర్- 70
- మహబూబాబాద్- 36
- మంచిర్యాల- 31
- మెదక్- 17
- మేడ్చల్ మల్కాజ్గిరి- 138
- ములుగు- 16
- నాగర్‌కర్నూల్- 17
- నల్గొండ- 108
- నారయణపేట్- 18
- నిర్మల్- 8
- నిజామాబాద్- 45
- పెద్దపల్లి- 21
- రాజన్న సిరిసిల్ల- 22
- రంగారెడ్డి- 130
- సంగారెడ్డి- 58
- సిద్దిపేట్- 70
- సూర్యాపేట్- 69
- వికారాబాద్- 27
- వనపర్తి- 31
- వరంగల్ రూరల్- 24
- హనుమకొండ- 88
- యాదాద్రి భువనగిరి- 28
Also read: KTR: క్యూట్ బట్ సీరియస్... ఏడేళ్ల బాలుడి కంప్లైంట్‌పై కేటీఆర్ క్విక్ రియాక్షన్...
Also read: CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ మేనమామ కమలాకర్ రావు మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook