Teacher suspended for allowing students to perform Namaz: క్లాస్ రూమ్‌లో పిల్లలను నమాజ్ చదివేందుకు అనుమతిస్తోందన్న కారణంతో ఓ ప్రభుత్వ టీచర్‌ను కర్ణాటక విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ఈ మేరకు విద్యా శాఖ శుక్రవారం (జనవరి 28) ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని హిందూ సంఘాలు ఆ టీచర్‌పై విద్యా శాఖకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని (Karnataka) కోలార్ జిల్లా సోమేశ్వరపాల్య పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సస్పెండ్ అయిన ఉమా దేవి అనే ఆ టీచర్ సోమేశ్వరపాల్యలోని బలెచెంగప్ప కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో (Kannada Model Primary School) ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పిల్లలను శుక్రవారం రోజు స్కూల్లోనే నమాజ్ చదివేందుకు అనుమతిస్తే.. వారు స్కూల్‌కు గైర్హాజరు కాకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే ఆమె వారిని అందుకు అనుమతించినట్లు స్థానిక రిపోర్టర్లు కొందరు వెల్లడించారు. కానీ విద్యా శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించడంతో ఆమెపై వేటు పడక తప్పలేదు.
'విద్యార్థుల్లో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఉంది. స్కూళ్లలో మత సామరస్యాన్ని పెంపొందించే చర్యలు ఉండాలి. కానీ ఇలా విద్యార్థులను క్లాస్‌రూమ్స్‌లో నమాజ్ చదివేందుకు అనుమతించడం... వారిలో విభజిత మనస్తత్వాన్ని ఏర్పరుస్తుంది.' అని విద్యా శాఖ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని... మొత్తంగా పాఠశాల పురోగతికే అడ్డంకిగా మారుతుందని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఆమె చేసిన పని కర్ణాటక సివిల్ కండక్ట్ రూల్స్ 1966, సెక్షన్ 3 (i), (ii), (iii)కి విరుద్ధమని.. అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Muslim students studying in the school had to go out for namaz, Most of them were getting leave for the purpose of namaz & not returning to school. Keeping that in mind they will miss classes/teaching head madam #UmaDevi allowed them to perform namaz in empty classroom.
2/n pic.twitter.com/XF3uWq0EVa— Syed Mueen (@Mueen_magadi) January 23, 2022
ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతున్నందునా.. విచారణ ముగిసేంతవరకూ టీచర్ ఉమాదేవి సస్పెన్షన్‌లో ఉండనున్నారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అనుమతి లేనిదే జిల్లాను విడిచిపోవద్దని విద్యా శాఖ ఆమెను ఆదేశించింది. కాగా, క్లాస్ రూమ్‌లో విద్యార్థులు నమాజ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. దీనిపై కొంతమంది రిపోర్టర్లు, స్థానిక ముస్లింలు స్పందించారు. శుక్రవారం నమాజ్ కారణంగా కొంతమంది విద్యార్థులు స్కూల్‌కు వెళ్లట్లేదని, లేదా నమాజ్ కోసం స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నారని చెప్పారు. అలా వెళ్లినవాళ్లు మళ్లీ స్కూల్‌కు తిరిగిరావట్లేదన్నారు. విద్యార్థులు స్కూల్‌కు గైర్హాజరు కాకుండా చూసేందుకు... ఖాళీగా ఉన్న క్లాస్‌రూమ్‌లో టీచర్ ఉమాదేవి నమాజ్‌కు అనుమతించినట్లు చెప్పారు.
Also Read: Darshanam Mogilaiah: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ రూ.1 కోటి నజరానా
Also read: EPFO Money withdraw: ఉమంగ్ యాప్ ద్వారా కొవిడ్-19 అడ్వాన్స్ ఇలా డ్రా చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook