US First Execution 2022: అమెరికాలో ఈ ఏడాది తొలి మరణ శిక్ష అతనికే...

US First Execution Of 2022 : జంట హత్యల కేసులో దోషిగా తేలిన గ్రాంట్ అనే వ్యక్తికి గురువారం ఓక్లహామాలో మరణ శిక్ష అమలుచేశారు. ఈ ఏడాది అమెరికాలో ఇదే తొలి మరణ శిక్ష.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 12:56 AM IST
  • అమెరికాలో ఈ ఏడాది తొలి మరణ శిక్ష ఓక్లహామాలో
  • 46 ఏళ్ల గ్రాంట్ అనే వ్యక్తికి మరణ శిక్ష అమలు
  • లెథల్ ఇంజెక్షన్ ద్వారా అతనికి మరణ శిక్ష
US First Execution 2022: అమెరికాలో ఈ ఏడాది తొలి మరణ శిక్ష అతనికే...

US First Execution Of 2022 : అమెరికాలోని ఓక్లహామా(Oklahoma) రాష్ట్రంలో గురువారం (జనవరి 27) డొనాల్డ్ ఆంథోనీ గ్రాంట్ (46) అనే వ్యక్తికి మరణ శిక్ష అమలుచేశారు. ప్రాణాంతక లెథల్ ఇంజెక్షన్ ద్వారా అతనికి మరణ శిక్ష అమలుచేశారు.  ఈ ఏడాది అమెరికాలో ఇదే తొలి మరణ శిక్ష కావడం గమనార్హం. 2001లో జరిగిన జంట హత్యల కేసులో ఆంథోనీ గ్రాంట్‌ దోషిగా తేలడంతో అతనికి కోర్టు మరణ శిక్ష విధించింది.

అప్పట్లో జైల్లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్‌కు బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బు కోసం ఆంథోనీ గ్రాంట్ ఓ హోటల్లో దోపిడీకి యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు హోటల్ సిబ్బందిని హత్య (Murder) చేశాడు. ఈ కేసులో 2005లో అతనికి మరణ శిక్ష పడింది. దీన్ని సవాల్ చేస్తూ గ్రాంట్ ఇప్పటివరకూ పలుమార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. చిన్నతనంలో తన తాగుబోతు తండ్రి చేతిలో చిత్రహింసలకు గురైనందునా.. తాను ఫెటల్ ఆల్కాహాల్ సిండ్రోమ్, బ్రెయిన్ ట్రామాతో బాధపడుతున్నట్లు గతంలో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నాడు. అయితే కోర్టు వాటిని కొట్టిపారేసింది.

తన తాజా పిటిషన్‌లో మరణ శిక్ష విధించే పద్దతిపై గ్రాంట్ ఆందోళన వ్యక్తం చేశాడు. యూఎస్ సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టిపారేసింది. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోవడంతో 46 ఏళ్ల గ్రాంట్‌కు గురువారం ఉదయం 10.30గంటలకు మరణ శిక్ష అమలుచేశారు. లెథల్ ఇంజెక్షన్ ద్వారా అతనికి శిక్ష అమలుచేసినట్లు చెబుతున్నారు. విషపూరితమైన ఈ ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

నిజానికి అమెరికాలో దాదాపు 23 రాష్ట్రాలు మరణ శిక్షలను రద్దు చేశాయి. ఓక్లహామా సహా పలు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ మరణ శిక్షలు అమలవుతున్నాయి. ఈ ఏడాది అమెరికాలో (America) పదుల సంఖ్యలో మరణ శిక్షలు అమలయ్యే అవకాశం ఉంది. ఇందులో టెక్సాస్, ఓహియో రాష్ట్రాల్లోనే ఎక్కువ మరణ శిక్షలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. 

Also Read: India vaccination: దేశంలో 95 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News