Bank Holidays February 2022: ఫిబ్రవరిలో 12 బ్యాంక్​ సెలవులు- పూర్తి జాబితా ఇదే..

Bank Holidays February 2022: వచ్చే నెలలో మీకు బ్యాంకుల్లో ఏదైనా పని ఉందా? అయితే వచ్చే నెల సెలవుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 10:41 PM IST
  • ఫిబ్రవరి సెలవుల జాబితా ప్రకటన
  • వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా సెలవు దినాలు
  • ఫిబ్రవరి 19న మహారాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు!
Bank Holidays February 2022: ఫిబ్రవరిలో 12 బ్యాంక్​ సెలవులు- పూర్తి జాబితా ఇదే..

Bank Holidays February 2022: ఈ ఏడాది ఫిబ్రవరి బ్యాంక్​ సెలవుల జాబితా ( February Bank Holidays) వచ్చేసింది.

పండుగలు, ఇతర ప్రత్యేక దినాల ఆధారంగా నిర్ణయించిన జాబితా ప్రకారం.. ఫిబ్రవరిలో మొత్తం 12 బ్యాంక్ సెలవులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ సెలవులు వర్తించవు. స్థానిక పండుగలను, ప్రత్యేక రోజులను బట్టి ఈ సెలవులు (Bank Holidays in February 2022) మారుతుంటాయి.

కాబట్టి బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే ముందుగానే ప్లాన్​ చేసుకోవడం మంచింది. అలా ప్లాన్​ చేసుకోవాలంటే.. ముందుగా బ్యాంక్ సెలవుల పూర్తి వివరాలు (Banking Alert) తెలియాలి. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఫిబ్రవరి బ్యాంక్​ సెలవుల జాబితా (Bank Holidays list)..

  • ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్​ (గ్యాంగ్​టాక్​లో బ్యాకులలకు వర్తిస్తుంది)
  • ఫిబ్రవరి 5: సరస్వతి పూజా, శ్రీ పంచమి, వసంత పంచమి (కోల్​కతా, భువనేశ్వర్​, అగర్తలకు వర్తింపు)
  • ఫిబ్రవరి 6: ఆదివారం సాధారణ సెలవు
  • ఫిబ్రవరి 12: రెండో శనివారం సాధారణ సెలవు
  • ఫిబ్రవరి 13: ఆదివారం సాధారణ సెలవు
  • ఫిబ్రవరి 15: మహమ్మద్ హజ్రత్ అలీ జయంతి, లుయిస్​-నాగాయ్​-ని (ఇంఫల్​, కాన్​పూర్​, లక్నోల్లో బ్యాంకులకు సెలవు)
  • ఫిబ్రవరి 16: గురు రవిదాస్​ జయంతి (చంఢీగడ్​లో బ్యాంకులకు వర్తింపు)
  • ఫిబ్రవరి 18: దోల్​జాత్రా​ (కోల్​కతాలో బ్యాంకులకు సెలవు)
  • ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్​ జయంతి (మహారాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
  • ఫిబ్రవరి 20: ఆదివారం సాధారణ సెలవు
  • ఫిబ్రవరి 26: నాలుగో శనివారం సాధారణ సెలవు
  • ఫిబ్రవరి 27: ఆదివారం సాధారణ సెలవు

Also read: Budget 2022: బడ్జెట్ 2022-23పై ఐటీ రంగం అంచనాలు, ఆశలు ఇవే..!

Also read: Budget 2022: కేంద్రం ఆ ప్రకటన చేస్తే- పీపీఎఫ్​ ద్వారా రూ.80 లక్షల ఆదాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News