RGV Konda Trailer: నీతులు చెప్పుడు కాదు, బాగు చేయాలి అంటోన్న ఆర్జీవీ

Ram Gopal Varma KONDA Trailer: సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు అంటూ ఆర్జీవీ వాయిస్‌తో "కొండా" ట్రైలర్‌.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 02:10 PM IST
  • కొండా మురళీ, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా "కొండా" మూవీ
  • కొండా ట్రైలర్‌ రిలీజ్
  • పవర్‌‌ ఫుల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌ ఇచ్చిన ఆర్జీవీ
RGV Konda Trailer: నీతులు చెప్పుడు కాదు, బాగు చేయాలి అంటోన్న ఆర్జీవీ

Konda Official Trailer: దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. కొండా మురళీ, సురేఖ దంపతుల జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన మూవీ "కొండా". ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. "విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని..  కార్ల్‌మార్క్స్‌ 180 సంవత్సరాల క్రితం చెప్పాడు.. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య పుట్టిన వాడే కొండా మురళీ." అనే డైలాగ్స్‌తో ఈ ట్రైలర్‌‌ ఆకట్టుకుంటోంది. ఆర్జీవీ (RGV) పవర్‌‌ ఫుల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌ ఇచ్చారు.

ఆర్జీవీ డైరెక్షన్‌లో యాక్షన్‌, ఫ్యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన "కొండా" మూవీలో త్రిగన్‌, ఐరా మోర్‌, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ "కొండా" మూవీ ట్రైలర్‌ (RGV KONDA Trailer) ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 

 

Also Read: Hero Srikanth corona: టాలీవుడ్ ను వదలని కరోనా మహమ్మారి.. హీరో శ్రీకాంత్ కు కరోనా పాజిటివ్

సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు... బాగు చేయాలి... నీకు పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప అంటూ ఆర్జీవీ  వాయిస్‌తో ప్రారంభమయ్యే "కొండా" మూవీ ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ అదిరిపోయింది. త్రిగన్‌ నటన మెప్పించేలా ఉంది. నా నిర్ణయాలకు నేనే బాధ్యుడిని.. కాబట్టి నా మాటే నేను వింటా.. నా పేరు కొండా మురళీ అంటూ త్రిగన్‌ చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

Also Read: Budget 2022: కేంద్రం ఆ ప్రకటన చేస్తే- పీపీఎఫ్​ ద్వారా రూ.80 లక్షల ఆదాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News