Diabetes New Medicine: మధుమేహ వ్యాధిగ్రస్థులకు గుడ్‌న్యుస్. డయాబెటిస్ నియంత్రణకు మరో ఔషధం అందుబాటులో వచ్చేసింది. ప్రముఖ కంపెనీ నోవోనార్డిస్క్ ఈ కొత్త మందును భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.
దేశంలో అతి సాధారణంగా, ఎక్కువశాతం మందిని పీడిస్తున్న సమస్య డయాబెటిస్. ఇప్పటికే మార్కెట్లో డయాబెటిస్ నియంత్రణకు చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నా..ఇంకా అవసరం మాత్రం తీరడం లేదు. ఈ తరుణంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ప్రముఖ ఔషధ కంపెనీ నోవోనార్డిస్క్ గుడ్‌న్యూస్ అందించింది. డయాబెటిస్ నిర్మూలనలో అద్భుతంగా పనిచేస్తున్న సెమాగ్లూటైడ్ (Semaglutide Medicine) మందును ప్రపంచంలోనే తొలిసారిగా ఓరల్ ట్యాబ్లెట్ రూపంలో అందిస్తోంది. ఇప్పటి వరకూ ఈ మందు కేవలం ఇంజక్షన్ రూపంలోనే అందుబాటులో ఉంది. డయాబెటిస్ (Diabetes)వ్యాధిగ్రస్థుల్లో బ్లడ్ షుగర్ లెవల్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలో ఈ ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది.
ఇప్పటికే ఈ ఔషధంపై ఇండియా సహా పలు దేశాల్లో పది ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది నోవోనార్డిస్క్ (Novonordisk) కంపెనీ. ఈ ట్రయల్స్‌లో వేయికి పైగా భారతీయులే ఉన్నారని కంపెనీ ప్రకటించింది. యూఎస్ మార్కెట్లో ఈ మందుకు 2019లో ఆమోదం లభించగా..ఇండియాలో 2020 డిసెంబర్లో ఆమోదం లభించింది.సెమాగ్లూటైడ్ మందును ట్యాబ్లెట్ రూపంలో తీసుకొచ్చేందుకు నోవోనార్డిస్క్ సంస్థ 15 ఏళ్లపాటు విస్తృతమైన పరిశోధనలు చేసి..విజయం సాధించింది.
Also read: Seven Soups: బరువు తగ్గేందుకు ఏడు రకాల అద్భుతమైన సూప్‌లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.