/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Is Sreeja takes divorce from husband Kalyaan Dhev: ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మరియు హాలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీల విడాకులు వార్తల్లో నిలుస్తున్నాయి. టాలీవుడ్‌లో ఇటీవల నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న కోలీవుడ్‌లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయినట్లు ప్రకటించారు. తాజాగా టాలీవుడ్‌లో మరో జంట విడిపోనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ 'మెగాస్టార్' చిరంజీవి చిన్న కూతురు శ్రీజ (Sreeja ), ఆమె భర్త కళ్యాణ్ దేవ్ (Kalyaan Dhev) విడాకులు తీసుకోబుతున్నారట. 

నిజానికి శ్రీజ, కళ్యాణ్ దేవ్ విషయమై గత కొన్ని నెలల నుంచే సోషల్ మీడియాలో రూమర్లు రావడం ప్రారంభమయ్యాయి. ఇటీవలి కాలంలో కళ్యాణ్ మెగా సెలబ్రేషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. శ్రీజ పోస్ట్‌లో కూడా ఉండేవాడు కాదు. కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్‌లో కూడా శ్రీజ కనిపించేది కాదు. ఇటీవల జరిగిన మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. సంక్రాంతికి విడుదలైన కళ్యాణ్ సినిమా 'సూపర్ మచ్చి'కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. 

Also Read: IND vs SA: టీమిండియాను మిడిలార్డర్‌ సమస్య వేధిస్తోంది.. అతడిని జట్టులోకి తీసుకోవాల్సిందే: మంజ్రేకర్‌

ఇక తాజాగా శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పేరుని మార్చేశారు. అంతకు ముందు భర్త పేరును కలిపి 'శ్రీజ కళ్యాణ్' పేరును పెట్టుకున్న శ్రీజ.. కళ్యాణ్ పేరును తొలగించి తండ్రి ఇంటి పేరు కొణిదెలను యాడ్ చేసి 'శ్రీజ కొణిదెల'గా మార్చారు. దీంతో ఇన్ని రోజులుగా వినిపించిన రూమర్లే (Sreeja - Kalyaan Dhev Divorce ) నిజమా? అని అందరూ అనుకుంటున్నారు. గతంలో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇలానే చేశారు. అక్కినేని అనే పేరును తొలగించడంతో విడాకుల రూమర్లు రావడం ప్రారంభించాయి. చివరకు అవే నిజమయ్యాయి. 

శ్రీజకు కళ్యాణ్ దేవ్ రెండవ భర్త. 2007లో శిరీష్ భ‌ర‌ద్వాజ్‌ను ఆర్య స‌మాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ.. అతనితో 2014లో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. కళ్యాణ్, శ్రీజకు 'నవిష్క' అనే పాప ఉంది. చిరంజీవి అల్లుడిగా మారక కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సినిమాలు తీసినప్పటికి.. అవి ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాయి. 'సూపర్ మచ్చి' కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

Also Read: Dasari Arun Kumar Arrest: మద్యం మత్తులో భీభత్సం.. దాసరి నారాయణరావు కుమారుడు అరెస్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Is Chiranjeevi's daughter Sreeja takes divorce from husband Kalyaan Dhev
News Source: 
Home Title: 

సమంత బాటలోనే.. మెగా డాటర్! విడాకులు కన్ఫర్మ్.. ప్రూఫ్ ఇదిగో!!

Sreeja Konidela Divorce: సమంత బాటలోనే.. మెగా డాటర్! విడాకులు కన్ఫర్మ్.. ప్రూఫ్ ఇదిగో!!
Caption: 
Is Chiranjeevi's daughter Sreeja takes divorce from husband Kalyaan Dhev (Source: Twitter)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

టాలీవుడ్‌లో మరో జంట విడిపోనుందా

సమంత బాటలోనే.. మెగా డాటర్

పేరు మార్చుకున్న శ్రీజ కొణిదెల

Mobile Title: 
సమంత బాటలోనే.. మెగా డాటర్! విడాకులు కన్ఫర్మ్.. ప్రూఫ్ ఇదిగో!!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, January 20, 2022 - 16:01
Request Count: 
216
Is Breaking News: 
No