Three Eyed and Four holes Nose Calf born in Chattisgarh: ప్రపంచంలో ఎన్నో అద్బుతాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు ఎక్కడో ఓచోట ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటుంటాయి. అందులో కొన్ని చిత్రవిచిత్రమైన, ఎవరూ నమ్మలేని కూడా ఉంటాయి. ఈ భూమి మీద నివసించే జంతువులు ఒక్కోసారి వింత జీవాలకు జన్మనిస్తుంటాయి. వాటిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. ఓ ఆవు (Cow) వింత దూడ (Calf)కు జన్మనిచ్చింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఛత్తీస్‌గఢ్ (Chattisgarh)లోని రాజ్‌నందగావ్ జిల్లాలోని నవాగావ్‌కు చెందిన రైతు హేమంత్ చందేల్ (Hemant Chandel)కు వ్యవసాయంతో పాటు ఆవులు కూడా పెంచుతున్నాడు. బుందేలి గ్రామ రైతు అయిన చందేల్‌కు చెందిన జెర్సీ ఆవు వింత దూడ (Three Eyed Calf)కు జన్మించింది. గత శుక్రవారం (జనవరి 14) రాత్రి 7 గంటల సమయంలో ఆవు.. దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టింది. దాంతో ఆ రైతు ఆశ్చర్యపోయాడు. వెంటనే పశువైద్యులకు సమాచారం ఇవ్వగా.. వారు దూడకు పరీక్షలు నిర్వహించారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలా పుట్టిందని పశువైద్యులు చెప్పారు.
Also Read: Nidhi Agarwal Remuneration: భారీగా పెంచిన నిధి అగర్వాల్.. ఏకంగా రెండు రెట్లు..!!
మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టిన ఆ ఆవు దూడ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉందట. పశువైద్యుడు డాక్టర్ నరేంద్ర సింగ్ మాట్లాడుతూ... 'ఇది ఓ అద్భుతం. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్లనే దూడ ఇలా పుట్టింది. పిండం నిర్ణీత సమయంలో అభివృద్ధి చెందనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. దూడ పూర్తి ఆరోగ్యంతో ఉంది. కానీ దూడను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే దాని ప్రాణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది' అని అన్నారు.
Chhattisgarh| Three-eyed cow born in Rajnandgaon district worshipped as reincarnation of god Shiva
"We were surprised. Its nose has four holes instead of two & has 3 eyes. Medical screening has been done. She is healthy. Villagers are worshipping the calf," said Neeraj (16.01) pic.twitter.com/NrG2b8LNXt
— ANI (@ANI) January 17, 2022
మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టిన ఆ ఆవు దూడ మకర సంక్రాంతి (Sankranthi) రోజు జన్మించడం వల్ల గ్రామస్తులు శివుడిగా (Lord Shiva) భావిస్తున్నారు. గ్రామ ప్రజలు దీనిని ఓ అద్భుతంగా భావించి దర్శనం కోసం రైతు ఇంటి వద్దకు తరలివస్తున్నారు. భక్తులు అందరూ దూడకు అగరబత్తులు, పువ్వులు, కొబ్బరికాయ మరియు డబ్బు సమర్పించుకుంటున్నారు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. చుసిన వారందరూ దూడను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook