Ramesh Babu Acting Career: సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) మరణం సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా కృష్ణ, మహేష్ అభిమాన లోకం రమేష్ బాబు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. చాలాకాలంగా లైమ్ లైట్‌లో లేని రమేష్ బాబు గురించి ఒక్కసారిగా మరణ వార్త వినాల్సి రావడంతో చాలామంది షాక్‌కి గురయ్యారు. రమేష్ బాబు మరణంపై ఇప్పటివరకూ కుటుంబ వర్గాల నుంచి అధికారిక ప్రకటన గానీ సమాచారం గానీ లేదు. అయితే ఆయన చికిత్స పొందిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు రమేష్ బాబు మరణాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. రమేష్ బాబు మరణం నేపథ్యంలో ఒకసారి ఆయన సినీ జర్నీని పరిశీలిద్దాం...
ఆ సినిమా ఒక్కటే..:
1974 లోనే 'అల్లూరి సీతారామ రాజు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా రమేష్ బాబు వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నాదమ్ముల సవాల్ వంటి చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించారు. 1987లో 'సామ్రాట్' సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా సోలో హీరోగా దాదాపు డజనుకు పైగా చిత్రాల్లో నటించారు. అయితే ఇందులో 'బజార్ రౌడీ' చిత్రం మినహా మిగతా చిత్రాలేవీ ఆశించినంతగా ఆడలేదు.
మొదట మాస్ పాత్రల్లో.. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో..
సోలో హీరోగా మొదట్లో మాస్ పాత్రల్లో కనిపించిన రమేష్ బాబు... ఆ సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడంతో కుటుంబ కథ చిత్రాల వైపు మళ్లారు. అలా నా ఇల్లే నా స్వర్గం, అన్నా చెల్లెలు, పచ్చ తోరణం వంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ రమేష్ బాబు సక్సెస్‌ని అందుకోలేకపోయారు. దీంతో రమేష్ బాబు జానపద కథా చిత్రాల వైపు దృష్టి పెట్టినట్లు చెబుతారు.
యాక్టింగ్ కెరీర్‌కు ముగింపు...
ప్రముఖ జానపద కథా చిత్రాల దర్శకుడు విఠలాచార్య కుమారుడు శ్రీనివాస్ విఠలాచార్య దర్శకత్వంలో ఒక సినిమా, ప్రముఖ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో మరో జానపద సినిమాలో ఆయన నటించాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో ఆ రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత 1997లో 'ఎన్‌కౌంటర్' సినిమాలో సహాయ నటుడిగా కనిపించారు. అదే నటుడిగా ఆయన చివరి సినిమా. హీరోగా దాదాపు 15 చిత్రాల్లో నటించినప్పటికీ.. కథల ఎంపిక సరిగా లేకపోవడంతో రమేష్ బాబు సక్సెస్ కాలేకపోయారని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. నటనకు ముగింపు పలికాక నిర్మాతగా మారిన రమేష్ బాబు.. సోదరుడు మహేష్ బాబుతో (Mahesh Babu) అర్జున్, అతిథి చిత్రాలు, హిందీలో అమితాబ్ బచ్చన్‌తో 'సూర్యవంశం' చిత్రాలు నిర్మించారు.
Also Read: Breaking News: సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి