Omicron Variant: ఊహించిందే జరుగుతోంది. ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్ స్థానిక సంక్రమణ ప్రారంభమైపోయింది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణ పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. అటు ఖమ్మం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.
ఇండియాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుంది. ఇప్పటి వరకూ విదేశాల్నించి సంక్రమించిన పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు తాజాగా సెకండరీ కాంటాక్ట్ వెలుగు చూడటం కలవరం రేపుతోంది. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన వైద్యుడికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ కావడమే ఇందుకు ఉదాహరణ. ఈ వైద్యునికి ఓ విదేశీయుడి నుంచి సోకినట్టు తెలిసింది. ఇదే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. రాష్ట్రంలో సెకండరీ కాంటాక్ట్ ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎందుకంటే ఇప్పటి వరకూ వెలుగుచూసిన కేసుల్లో అన్నీ విదేశాల్నించి వచ్చినవారే కావడం అంటే ప్రైమరీ కాంటాక్ట్ కేసులే. ఇప్పుడు తొలిసారిగా సెకండరీ కాంటాక్ట్ (Omicron Secondary Contact)కేసుకు ఒమిక్రాన్ సోకడం నిజంగా కలవరం కల్గించే అంశం.
తెలంగాణలో ఇప్పటికే ఒమిక్రాన్ (Omicron Variant)కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కు చేరుకుంది. అంటే దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులున్న రాష్ట్రాల్లో 3-4 స్థానాల్లో నిలుస్తోంది. అటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నుంచి ఖమ్మంకు వచ్చిన ఓ యువతికి జలుబు, దగ్గు ఉండటంతో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒమిక్రాన్ లక్షణాలు కూడా కన్పించడంతో హైదరాబాద్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించగా..ఒమిక్రాన్‌గా నిర్ధారణైంది. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకోవడం ఆందోళన కల్గిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే జనవరి నాటికి పరిస్థితి విషమించే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. స్థానికంగా సంక్రమణ ప్రారంభమైతే ఇక కట్టడి చేయడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. మరోవైపు కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు ఎక్కడా పాటించే పరిస్థితులు కన్పిచడం లేదు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం గగనంగా మారింది.
Also read: Sidhu controversy: ప్యాంట్లు తడిచిపోతాయంటూ.. పోలీసులపై సిద్ధూ వివదాస్పద వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook