Open Letter to CJI: కొందరికి సినిమాలంటే పిచ్చి. కొందరికి అదే పరమావధి. ఈ పిచ్చి ఎంత పీక్స్‌కు చేరిందో ఈ ఉదంతం వివరిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమను ఓ దుష్టశక్తి పట్టి పీడిస్తుందా..ఇంతకీ ఆ లేఖ రాసిందెవరు.
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా తెలుగు వ్యక్తి ఎన్‌వి రమణ (Justice Nv Ramana) బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఏపీలోని తన స్వగ్రామంలో, చుట్టుపక్కల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అపూర్వ గౌరవం లభించింది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సాదరంగా ఆహ్వానిస్తూ..గౌరవ సూచకంగా తేనీటి విందు ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణకు ఓ అజ్ఞాత వ్యక్తి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఓ దుష్ట శక్తి పట్టి పీడిస్తోందంటూ రాసిన ఆ లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ లేఖ ఇదీ..(Letter to CJI)
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గారికి
తెలుగు సినిమా డై హార్డ్ అభిమానిగా ఈ లేఖ రాస్తున్నాను. తెలుగు సినిమా చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని కూలంకషంగా గమనించే వ్యక్తిని నేను. 89 ఏళ్ల తెలుగు సినిమా వైభవానికి నేను చాలా గర్వంగా ఉన్నాను. సినిమా లేకపోతే..ప్రజలకు ఆనందమనేది లేదు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఇది రుజువైంది.
ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయి..పరిస్థితి సామాన్యమవుతోంది. సినిమాలు విడుదలై..ప్రజల్ని ఆనందపరుస్తున్నాయి. అనుభూతిని నింపుతున్నాయి. తెలుగు సినిమా కోల్పోయిన వైభవం తిరిగి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఓ మహమ్మారిలా, దుష్ట శక్తి ఒకటి తెలుగు చలనచిత్ర పరిశ్రమను (Tollywood) పట్టి పీడిస్తూ ప్రజల ఆనందాన్ని హరిస్తోంది.
డియర్ సీజేఐ సర్..తీర్పులకు సంబంధించిన చట్టాలు, నిబంధనల గురించి నాకేమీ తెలియదు. కానీ సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తిని అంతం చేసేందుకు మీరు ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరిస్తారని మనవి చేస్తున్నాను. ఈ దుష్ట శక్తి టాలీవుడ్‌ను, సినీ ప్రేమికుల్ని వేధిస్తోంది. సాధ్యమైనంత త్వరగా దీనికొక పరిష్కారం చూపిస్తారని..లక్షలాది సినీ ప్రేమికుల్లో తిరిగి చిరునవ్వును ప్రసాదిస్తారని ఆశిస్తున్నాను.
ఇట్లు
తెలుగు సినిమా డై హార్డ్ అభిమాని
ఈ లేఖ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆ అభిమాని చెబుతున్న దుష్ట శక్తి (Dushta shakthi) ఎవరనే చర్చ ప్రారంభమైంది. సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలు (Online Tickets Issue), టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం (Ap governent) తీసుకున్న నిర్ణయాలకు అటు మద్దతు, ఇటు వ్యతిరేకత వస్తున్న తరుణంలో వెలువడిన ఈ లేఖ హల్‌చల్ చేస్తోంది. సరిగ్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో లేఖ విడుదల కావడం వెనుక కారణాలేంటనేది ఆసక్తిగా మారింది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తే..ఓ అభిమానిగా ఈ లేఖ విడుదల చేసి ఉండవచ్చనే సందేహం వ్యక్తమవుతోంది. నిజంగానే ఓ అభిమాని రాసుంటే..సినిమా పిచ్చి ఎంత పీక్స్‌కు చేరిందో ఈ లేఖను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
Also read: Hero Nikhil: థియేటర్లు మూతపడటం చూస్తుంటే గుండె పగిలిపోతుంది: నిఖిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Open Letter to CJI: తెలుగు సినిమాను దుష్ట శక్తి పీడిస్తోందా.సీజేఐకు ఆ లేఖ రాసిందెవరు