IPL 2022 Auction Dates Confirmed, Hyderabad Likely To host Mega Event: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా వేలానికి (IPL 2022 Auction) ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం తెలుస్తోంది. వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో జరగనుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటనలో ధృవీకరించాయని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. IPL 2022 వేలం 2018 మెగా వేలం మాదిరిగానే రెండు రోజుల పాటు జరగనుంది. ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జనవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల కారణంగా మెగా వేలం వాయిదా పడింది.
ఐపీఎల్ 2022 మొత్తగా 10 జట్లతో జరగనుంది. లక్నో, అహ్మదాబాద్ జట్లు కొత్తగా వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ మెగా వేలం (IPL 2022 Auction)ను నిర్వహిస్తోంది. 2022 ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేందుకు సన్నాహకాలు పూర్తయినట్లు సమాచారం. మెగా వేలంకు వేదిక సైతం నిర్ణయించారని తెలుస్తోంది. ఈసారి వేలాన్ని ముంబైలో కాకుండా బెంగళూరు (Bangalore), హైదరాబాద్ (Hyderabad ) నగరాల్లో నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే జరిగితే దక్షిణాదిలో వేలం జరగడం ఇదే మొదటిసారి కానుంది. హైదరాబాద్‌లలో జరగాలని తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Yasir Shah: మైనర్‌పై అత్యాచారం.. పాకిస్తాన్ స్టార్ ఆటగాడిపై ఎఫ్ఐఆర్ నమోదు! ఇక కెరీర్ కంచికే!!
ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని (IPL 2022 Auction) జనవరి మొదటి వారంలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇదివరకే ప్రకటించినప్పటికీ.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించి ఓ సమస్య పరిష్కారం కాకపోవడంతో నెల రోజులు పాటు వాయిదా పడింది. 'IPL 2022 వేలం ఫిబ్రవరి మొదటి వారంలో జరగనుంది. 2018లో మాదిరిగానే రెండు రోజులు వేలం నిర్వహిస్తాం. ఐపీఎల్ జీసీ ఈసారి మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. మెరుగైన స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది. వేలం కోసం బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాలుగా ముందు వరసలో ఉన్నాయి' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
IPL 2022 కోసం ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు నవంబర్ 30ని చివరి గడువుగా బీసీసీఐ (BCCI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉన్న 8 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. అయితే అన్ని జట్లు చాలా మంది సీనియర్ మరియు స్టార్ ప్లేయర్లను విడుదల చేశాయి. ఇప్పుడు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్‌లు విడుదలైన ప్లేయర్ల జాబితా నుంచి ఒక్కో జట్టు 3 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. లక్నో ఫ్రాంచైజీకి కేఎల్ రాహుల్, అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తారని సమాచారం తెలుస్తోంది. డేవిడ్ వార్నర్ మరియు హార్దిక్ పాండ్యాలను తీసుకునేందుకు అహ్మదాబాద్.. రషీద్ ఖాన్ కోసం లక్నో ఆసక్తిగా ఉన్నాయట.
Also Read: జరక్క జరక్క లేటు వయసులో ఆ బ్రహ్మచారికి పెళ్లి... ఇంతలోనే ఊహించని షాకిచ్చిన నవ వధువు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook