Andhra Pradesh Bus Accident: జంగారెడ్డి గూడెంలో ఆర్టీసీ బస్సు ప్రమాదాన్ని మరచిపోక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో బస్సు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన పర్చూరు సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయాని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.
బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి చీరాలకు బయల్దేరిన ఓ ప్రైవేట్ బస్సు.. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజు పాలెం వద్దకు రాగానే అగ్ని ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారు జామున కావడం వల్ల బస్సులోని ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు.
మంటలు చెలరేగుతున్న క్రమంలో బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. మంటలు వేగంగా వ్యాపించడం వల్ల బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల లగేజీ కూడా మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు, ముగ్గురు బస్సు సిబ్బంది ఉన్నారు.
జంగారెడ్డి గూడెంలో బస్సు ప్రమాదం.. 10 మంది మృతి
అంతకు ముందు పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 13 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ ను జగన్ ఆదేశించారు.
Also Read: Leopard Attack in Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత దాడి- బైక్ పై అమాంతం దూకేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook