India vs New Zealand Test Highlights: BCCI shares India and New Zealand players names with sync: రెండు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 167 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్ 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin), జయంత్ యాదవ్ (Yayant Yadav) తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal)కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. రెండు టెస్టుల్లో రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌ను 'ప్లేయర్ ది సిరీస్' అవార్డు వరించింది. ఇక ఈ విజయంతో భారత్ 1-0 తేడాతో రెండు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్ ముగిసాక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో వినోదం పంచాడు. భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) ఆటగాళ్లను వరుసలో నిలబెట్టి.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా పేర్లు వచ్చేలా చేశాడు. టీమిండియా ప్లేయర్ అక్షర్ (Axar Patel), కివీస్ ఆటగాడు పటేల్ (Ajaz Patel)లను పక్కపక్కనే నిలబెట్టగా.. అక్షర్ పటేల్ అయింది. అలానే న్యూజిలాండ్ ఆటగాడు రవీంద్ర (Rachin Ravindra), భారత్ ప్లేయర్ జడేజా (Ravindra Jadeja)లను పక్కపక్కనే నిలబెట్టగా రవీంద్ర జడేజా పేరు వచ్చింది. ఈ నలుగురు స్పిన్నర్లే కావడం ఇక్కడ విశేషం.
Also Read: RRR: ఆర్ఆర్ఆర్ నుంచి 'భీమ్' కొత్త పోస్టర్... ఇంటెన్స్ లుక్‌లో ఎన్టీఆర్
భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లకు సంబందించిన ఫొటోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'సింక్ భలే కుదిరింది' అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కూడా ఈ ఫొటోను పోస్ట్ చేసి 'పర్ఫెక్ట్ పిక్చర్' అని పేర్కొంది. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అజాజ్ పటేల్, రచిన్ రవీంద్రలకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసిన ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు. 'వావ్.. భారత్-న్యూజీలాండ్ ఆటగాళ్ల పేర్లు భలే కలిసాయే' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఆర్ అశ్విన్.. నువ్ సూపరో సూపర్' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
In Sync! ☺️
How's that for a quartet! 🇮🇳 🇳🇿#INDvNZ #TeamIndia @Paytm pic.twitter.com/eKqDIIlx7m
— BCCI (@BCCI) December 6, 2021
Also Read: Rapido Advt: ర్యాపిడో యాడ్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు, ఇక మళ్లీ షూట్ చేయాల్సిందే
గాయం కారణంగా రెండో టెస్టులో రవీంద్ర జడేజా ఆడని విషయం తెలిసిందే. అజాజ్ పటేల్ (Ajaz Patel) తొలి ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్ (Axar Patel) తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగులు, 2 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు, ఒక వికెట్ తీశాడు. ఇక రచిన్ రవీంద్ర (Rachin Ravindra) తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, 4 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు, 18 పరుగులు చేశాడు.
Picture perfect 👌
📸 @ashwinravi99 pic.twitter.com/av8LZdSAcZ
— ICC (@ICC) December 6, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook