IND vs NZ: ముగిసిన తొలిరోజు ఆట.. సెంచరీతో చెలరేగిన మయాంక్! భారత్ స్కోర్ ఎంతంటే?

ముంబై వేదికగా భారత్, న్యూజిల్యాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. 70 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ (120 నాటౌట్; 246 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ చేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 06:32 PM IST
  • ముగిసిన తొలిరోజు ఆట
  • సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్‌
  • భారత్ స్కోర్ ఎంతంటే?
IND vs NZ: ముగిసిన తొలిరోజు ఆట.. సెంచరీతో చెలరేగిన మయాంక్! భారత్ స్కోర్ ఎంతంటే?

IND vs NZ: Mayank Agarwal century helps India score 221 for 4 at stumps on Day 1: రెండు టెస్ట్ సిరీసులో భాగంగా ముంబై వేదికగా భారత్, న్యూజిల్యాండ్‌ (India vs New Zealand) జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. 70 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ (120 నాటౌట్; 246 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ చేశాడు. మయాంక్ సహ వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా (25 నాటౌట్‌; 53 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ (Ajaz Patel) నాలుగు వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ఆట ప్రారంభమైన సంగతి తెలిసిందే. వరణుడు ఓ సెషన్ తుడిచిపెట్టుకుపోయాడు. 

గత రెండు రోజులుగా ముంబైలో వర్షం కురవడంతో వాంఖడే పిచ్ పూర్తిగా తడిసి ముద్దయింది. వాంఖడే పిచ్ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్ నిర్ణీత సమయానికి ఆరంభం కాలేదు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి పరిస్థితులు అదుపులోకి రావడంతో టాస్‌ పడింది. దీంతో తొలి రోజు ఆటలో మొదటి సెషన్‌ తుడిచిపెట్టుకుపోయింది. 9 గంటలకు పడాల్సిన టాస్‌.. రెండున్నర గంటలు ఆలస్యంగా పడింది. ఇక మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. 

బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మయాంక్‌ అగర్వాల్ (Mayank Agarwal), శుభ్‌మన్‌ గిల్‌ (44: 71 బంతుల్లో 7x4, 1x6) మంచి ఆరంభం ఇచ్చారు. కివీస్ పేసర్లు కట్టుదిట్టమైన బంతులు వేసినా.. వారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. చెత్తబంతులను మాత్రమే బౌండరీలు తరలిస్తూ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే భారీ భాగస్వామ్యం అందించారు. అయితే 80 పరుగుల వద్ద గిల్‌ అవుట్ అయ్యాడు. అతడిని అజాజ్ పటేల్ బుట్టలో వేసుకున్నాడు. ఆపై ఒకే ఓవర్‌లో చేతేశ్వర్ పుజారా (0), విరాట్ కోహ్లీ (0)లను కూడా అజాజ్ ఔట్ చేసి భారీ షాక్ ఇచ్చాడు. అయితే కోహ్లీ అవుట్ వివాదాస్పదం అయింది. ఫీల్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించాడు. కోహ్లీ రివ్యూకి వెళ్లినా లాభం లేకుండా పోయింది. 

ఈ సమయంలో శ్రేయాస్ అయ్యర్ (18)తో కలిసి మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 160 వద్ద అయ్యర్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్దిమాన్ సాహా.. మయాంక్‌కు మద్దతుగా నిలిచాడు. వీళ్లిద్దరూ చాలా సంయమనంతో ఆడారు. ఈ క్రమంలోనే మయాంక్ టెస్టుల్లో నాలుగో సెంచరీ బాదాడు. ఇన్నింగ్స్ చివరివరకు మయాంక్, సాహా చక్కగా బ్యాటింగ్ చేశారు. చివర్లో వెలుతురిలేమితో ఇన్నింగ్స్‌ను 70 ఓవర్లకే అంపైర్లు ముగించారు. ఆట ముగిసేసమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత్‌ కోల్పోయిన నాలుగు వికెట్లూ అజాజ్ పటేల్ తీయడమే విశేషం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News