Jawad Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. ఏపీ తీరంవైపుకు దూసుకొస్తున్న వాయగుండం తుపానుగా మారనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరుణుడి ప్రతాపం ఇంకా కొనసాగుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే అల్లకల్లోలమయ్యాయి. నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఈ మూడు జిల్లాల్లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పుడు మరో తుపాను ముప్పు వెంటాడుతోంది.
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా దక్షిణ థాయ్‌లాండ్ సమీపంలో ఏల్పడిన అల్పపీడనం రేపటికి అంటే డిసెంబర్ 2 నాటికి వాయుగుండంగా బలపడనుందని అటు వాతావరణ శాఖ ఇటు స్కైమెట్ అంచనా వేశాయి. ఈ వాయుగుండం ఏపీ తీరంవైపుకు దూసుకొస్తోందని ఐఎండీ (IMD)తాజాగా హెచ్చరించింది. డిసెంబర్ 3వ తేదీ నాటికి మరింతగా బలపడి..తుపానుగా మారవచ్చని అంచనా. క్రమంగా వాయువ్య దిశగా పయనిస్తూ..డిసెంబర్ 4వ తేదీ నాటికి ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఈ వాయుగుండం తుపానుగా మారితే జవాద్‌గా(Jawad Cyclone Alert) నామకరణం చేయనున్నారు. సౌదీ అరేబియా ఈ పేరును సూచించింది. తుపాను ప్రభావం ఏపీతో పాటు ఒడిశాపై ఉండనుంది. తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rains) పడే సూచనలున్నాయి.
Also read: Niti Aayog: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ కానున్న నీతి ఆయోగ్ సభ్యుల బృందం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook