Vizag Gas Leakage: విశాఖలో మరో గ్యాస్ లీకేజీ ఘటన-ఇద్దరు కార్మికులు మృతి

Gas Leakage incident in Vishakapatnam: విశాఖపట్నంలోని పరవాడ ఫార్మా సిటీలో సోమవారం ఉదయం గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. రాంకీ ఫార్మా సంస్థలోని వ్యర్థ జలాల పంప్‌హౌస్‌లో విషవాయువులు లీకవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 12:58 PM IST
  • విశాఖ పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ లీకేజీ ఘటన
    విష వాయువులు లీకవడంతో ఇద్దరు కార్మికులు మృతి
    మృతులు మణికంఠ (25), దుర్గా ప్రసాద్‌ (25)
Vizag Gas Leakage: విశాఖలో మరో గ్యాస్ లీకేజీ ఘటన-ఇద్దరు కార్మికులు మృతి

Gas Leakage incident in Vishakapatnam: విశాఖపట్నంలో మరో గ్యాస్ లీకేజీ (Gas leakage) ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో (Pharma city) ఉన్న రాంకీ ఫార్మా సంస్థలో గ్యాస్ లీకైంది. వ్యర్థ జలాల పంప్‌హౌస్‌లో గ్యాస్ లీకవడంతో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. మృతి చెందిన యువకులను పాయకరావుపేటకు చెందిన  మణికంఠ (25), దుర్గా ప్రసాద్‌ (25)గా గుర్తించారు. 

సోమవారం ఉదయం మణికంఠ, దుర్గాప్రసాద్ వ్యర్థ జలాల పంప్‌హౌస్ వాల్వ్‌ను ఓపెన్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా విష వాయువులు లీకవడంతో (Toxic gases leaked) ఊపిరాడక ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం కేజీహెచ్‌కు (KGH) తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. తమ కుటుంబాలను రాంకీ యాజమాన్యం ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. 

విశాఖలో (Vishakapatnam) తరచూ గ్యాస్ లీకేజీ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది మే 7న ఎల్జీ పాలిమర్స్ ఫార్మా కంపెనీలో స్టైరీన్ గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అంతా నిద్రలో ఉన్న వేళ తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ నుంచి సుమారు 3కి.మీ మేర గ్యాస్ వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటికీ ఆ ప్రభావం నుంచి తేరుకోలేకపోతున్నామని అక్కడి గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆ గ్యాస్ లీకేజీ (Vizag Gas Leakage) బాధిత కుటుంబాలకు రూ.1కోటి పరిహారం ప్రకటించింది. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత విశాఖలోని పలు కెమికల్ కంపెనీల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. గ్యాస్ లీకేజీ ఘటనలు జరిగినప్పుడల్లా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Also Read: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలేంటి, ఏ వయస్సువారికి ప్రమాదకరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News