ఛీ.. హోలీ పేరుతో వీర్యం చల్లారు

హోలీ పండగ పేరుతో వికృత చేష్టలకు పాల్పడ్డారు కొంతమంది యువకులు.

Last Updated : Feb 28, 2018, 01:22 PM IST
ఛీ.. హోలీ పేరుతో వీర్యం చల్లారు

హోలీ పండగ పేరుతో వికృత చేష్టలకు పాల్పడ్డారు కొంతమంది యువకులు. వీర్యాన్ని బెలూన్స్ లో నింపి.. అమ్మాయిల మీదకు విసిరారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. హోలీ పండగను దేశ రాజధాని ఢిల్లీలో రెండు మూడు రోజుల ముందు నుంచే జరుపుకుంటారు. ఢిల్లీలో కొంతమంది యువతులు ఆదివారం అమర్ నగర్ కాలనీ మార్కెట్ లో నడుచుకుంటూ వెళుతుండగా.. కొందరు పోకిరీ యువకులు అమ్మాయిలను కాసేపు విసిగించి.. అనంతరం వారిపై వీర్యాన్ని నింపిన బెలూన్స్ ను విసిరేశారు. నలుపురంగు లెగ్గిన్స్ ధరించడంతో.. అమ్మాయిలకు యువకులు చల్లించి వీర్యమే అని నిర్ధారించుకొని.. సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. హోలీ సందర్భంగా భద్రత పెంచాలంటూ అమ్మాయిలు డిమాండ్ చేశారు. ఆ యువతులు ఎల్ఎస్ఆర్ కళాశాల స్టూడెంట్స్ అని తెలుస్తోంది.

 

Trending News