చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపించింది.. ఆ సమయంలో జగన్ నవ్వు దేనికి సంకేతం : జగ్గారెడ్డి

Congress MLA Jaggareddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని... ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలు సరికాదని అభిప్రాయపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 06:06 PM IST
  • చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చిన ఘటనపై జగ్గారెడ్డి రియాక్షన్
    చంద్రబాబు నాయుడు ఏడవడం ఇబ్బందిగా అనిపించిందన్న జగ్గారెడ్డి
    ఏపీలో ప్రజస్వామ్యం కొరవడినట్లుగా అనిపిస్తోందని కామెంట్
చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపించింది.. ఆ సమయంలో జగన్ నవ్వు దేనికి సంకేతం : జగ్గారెడ్డి

Congress MLA Jaggareddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెక్కి వెక్కి ఏడ్చిన ఘటనపై తెలంగాణ నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆ ఘటనపై స్పందించారు. చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకోవడం తనకు ఇబ్బందిగా అనిపించిందన్నారు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు మరిచిపోయి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ (YSRCP) నేతల ప్రవర్తన సమాజానికి చెడు సంకేతాలు పంపించేదిగా ఉందన్నారు.

ప్రజాస్వామ్యంలో విలువలను పరిరక్షించుకోవాలని జగ్గారెడ్డి (Jaggareddy) హితబోధ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును ఓ సందర్భంలో ఒక మాట అన్నారని... వెంటనే దాన్ని రికార్డుల నుంచి తొలగించమన్నారని గుర్తుచేసుకున్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని... ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడి పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు బాగోలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే... నీ పరిస్థితేంటి జగన్ (YS Jagan) అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం కొరవడినట్లుగా అనిపిస్తోందన్నారు. చంద్రబాబును వైసీపీ నేతలు విమర్శించేటప్పుడు జగన్ నవ్వు దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమేనని... కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరి (Nara Bhuvaneshwari) వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వెక్కి వెక్కి ఏడవడం టీడీపీ శ్రేణులను, నందమూరి, నారా కుటుంబాలను తీవ్రంగా కలచివేసింది. వైసీపీ నేతల తీరును ఖండిస్తూ ఇప్పటికే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గట్టి హెచ్చరికలు చేశారు. జూ.ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్, నారా రోహిత్‌లు సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. ఆడపడుచులపై పరుష  పదజాలం వాడటం అరాచక పాలనకు నాంది అని ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఏపీ అసెంబ్లీ ఘటన నా మనసును కలచి వేసింది: జూ. ఎన్టీఆర్

మరోవైపు వైసీపీ నేతలు మాత్రం అసలు అసెంబ్లీలో భువనేశ్వరి ప్రస్తావనే రాలేదని చెప్తున్నారు. చంద్రబాబు మెలోడీ డ్రామా ఆడుతున్నారన్నారని... రాజకీయ లబ్ది కోసమే ఇదంతా చేస్తున్నారని తాజాగా మంత్రి పేర్ని నాని (Perni Nani) విమర్శించారు. వైసీపీ నేతలు అనని మాటలను అన్నట్లు చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని... ఆయన సతీమణి ప్రస్తావన సభలో ఎక్కడా రాలేదని పేర్కొన్నారు. వ్యక్తులను, వ్యక్తిత్వాలను కించపరిచే రాజకీయాలకు తెరలేపింది చంద్రబాబే  అని విమర్శించారు. చంద్రబాబు చెప్పింది నిజమే అని నమ్మిన బాలకృష్ణ (Nandamuri Balakrishna) వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ నిజంగానే ఒక అమాయక చక్రవర్తి అని అన్నారు. నందమూరి కుటుంబసభ్యుల బుర్రల్లోకి చంద్రబాబు విషం ఎక్కిస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎంతలా దిగజారుతాడో చెప్పేందుకు నిన్నటి ఘటనలే నిదర్శనమన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x