/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

CM KCR plans Protest in Delhi : యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్‌ నడుస్తోంది. ప్రత్యర్థిని రైతుల ముందు దోషిగా నిలబెట్టేందుకు ఇరు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మీరంటే మీరే రైతులను ముంచుతున్నారని... మీరంటే మీరే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని (Paddy procurement) ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలు, డిమాండ్లకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకునపెట్టేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు కేసీఆర్ స్వయంగా ధర్నాలో పాల్గొనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ నెల 29న దీక్ష దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతుల కోసం ధర్నా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందునా... కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇదే మంచి తరుణమని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం( నవంబర్ 16) సాయంత్రం 4గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే శాసనాసభాపక్ష భేటీలో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వరి ధాన్యం కొనుగోలు (Paddy procurement) అంశమే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా మారనున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఎండగట్టేలా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. 

Also Read: AP Three Capital Issue: కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తులు తప్పుకుంటారా లేదా

ఇవాళ జరిగే సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను శాసనసభాపక్షానికి కేసీఆర్ (CM KCR) పరిచయం చేసే అవకాశం ఉంది. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ,జడ్పీటీసీ,మున్సిపల్ కార్పోరేటర్లు,కౌన్సిలర్లు తదితరులందరినీ కలుపుకునిపోయేలా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఆ ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ ఉమ్మడి జిల్లాల వారీగా సీనియర్ మంత్రులకు సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Section: 
English Title: 
cm kcr planning to protest in delhi over paddy procurement issue
News Source: 
Home Title: 

CM KCR: ఢిల్లీలో ధర్నా చేసే యోచనలో సీఎం కేసీఆర్...

 CM KCR: ఢిల్లీలో ధర్నా యోచనలో సీఎం కేసీఆర్...  ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు
Caption: 
File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

వరి ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో ధర్నా యోచనలో సీఎం కేసీఆర్
కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం
ఈ నెల 29న ఢిల్లీలో ధర్నా చేసే ఛాన్స్ 

Mobile Title: 
CM KCR: ఢిల్లీలో ధర్నా చేసే యోచనలో సీఎం కేసీఆర్...
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, November 16, 2021 - 10:22
Request Count: 
95
Is Breaking News: 
No